Vijay devarakonda - Family Star Run Time: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజాగా చిత్రం 'ది ఫ్యామిలీ స్టార్'. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌,టీజర్, ట్రైలర్, మూడు సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ప్రమోషన్స్ విషయంలో ఈ సినిమా దూకుడు మీదుంది. ఇక 'గీత గోవిందం' తర్వాత   విజయ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబోలో వస్తోన్న రెండో చిత్రం కావడంతో 'ఫ్యామిలీ స్టార్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'గీత గోవిందం' సినిమాకు సంగీత బాణీలు అందించిన గోపీ సుందర్ మరలా ఈ సినిమాకు మంచి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు అవి ప్రూవ్ చేసాయి.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాగూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్‌ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండ తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటి కపుడు ఇస్తూ ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు. ఇదే ఆయన్ని ఫ్యాన్స్‌కు దగ్గరయ్యేలా చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూర్తి ఫ్యామిలీ ఎంటర్టేనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రానికి వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌.  ఏప్రిల్ 5వ తేదిన ఈ సినిమా ను తెలుగు,తమిళంలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పాటల్లో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీకి ఆడియన్స్ థ్రిల్ ఫీలవుతున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రన్ టైమ్ లాక్ అయింది. ఈ సినిమా 2 గంటల 40 నిమిషాలు ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేస్తూ ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.


 విజయ్ దేవరకొండ విషయానికొస్తే.. ఈయనకు ప్రముఖ  సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో 21 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తెలుగులో అల్లు అర్జున్, రామ్ చరణ్ తర్వాత  ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న మూడో హీరోగా విజయ్ దేవరకొండ నిలిచారు. రౌడీ హీరో ఇన్‌స్టాను ఈ రేంజ్ ఫాలోవర్స్ అనుసరించడం స్టార్ గా ఆయన క్రేజ్ ను ఎలాంటిదో చూపిస్తోంది. అంతేకాదు తనకు సినిమాలకు పర్సనల్ లైఫ్‌కు సంబంధించి వచ్చే రూమర్స్ పై ఎప్పటికపుడు స్పందిస్తూ ఉంటూ ఉంటారు.


విజయ్ దేవరకొండ గతేడాది  'ఖుషీ' మూవీతో ఆడియన్స్‌ను పలకరించారు విజయ్ దేవరకొండ. అంతకు ముందు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' మూవీలో ప్యాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్‌ ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన విజయం సాధించలేదు. అయినా.. ఈ కెరీర్ పై పెద్దగా ఎఫెక్ట్ ఏమి చూపించలేదు. ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతున్నాడు. ది ఫ్యామిలీ మ్యాన్ సినిమాతో విజయ్ దేవరకొండ మరో హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.


ఇదీ చదవండి:  ఆరోగ్యాన్నిచ్చే అక్రోట్లు.. డైలీ ఇలా తింటే మీ శరీరంలో బిగ్ మిరాకిల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook