Vijay Devarakonda - VD 12: విజయ్ దేవరకొండ తెలుగులో రౌడీ హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక గీత గోవిందం తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. రీసెంట్ గా పరశురామ్ పేట్ల దర్శకత్వంలో చేసిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమా ఓటీటీ వేదికగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఫ్యామిలీ స్టార్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీలో అర్జునుడి పాత్రలో కాసేపు అలా కనిపించి ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాదు కల్కి పార్ట్ 2లో విజయ్ దేవరకొండకు పాత్ర నిడివి కూడా ఎక్కువగా ఉండబోతున్నట్టు సమాచారం. ఆ సంగతి పక్కన పెడితే..ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. పూర్తి స్పై నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తాజాగా యుద్ధ ఖైదీగా ఉన్న విజయ్ దేవరకొండ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.



పూర్తి మేకోవర్ లుక్ తో విజయ్ లుక్స్ స్టన్నింగ్ అనిపిస్తోంది. ఈ పాత్ర కోసం విజయ్ దేవరకొండ గుండూ కూడా కొట్టించుకోవడం విశేషం. అందుకే బయట తలపై టోపీతో ఆ లుక్ ను కవర్ చేస్తున్నాడు. ఈ సినిమాకు అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగ సౌజన్య, నాగ వంశీ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే యేడాది మార్చి 28న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తంగా వచ్చే సమ్మర్ కోసం ఒక్కో హీరోగా ఇప్పటి నుంచే ఖర్చీఫ్ వేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే ‘ది రాజా సాబ్’ మూవీ ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దానికి రెండు వారాలు ముందు విజయ్ దేవరకొండ.. బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నాడు. మరోవైపు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఇప్పటికే క్యాస్టింగ్ కాల్ నిర్వహిస్తున్నారు మేకర్స్.


ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..


ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter