Vijay Devarakonda Opens Up on His Relationship: నువ్విలా సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చి పెళ్లి చూపులు సినిమాతో హీరోగా స్థిరపడిన విజయ్ దేవరకొండ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించాడ. ప్రస్తుతం ఆయన లైగర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన హిందీ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్గా నటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా తెలుగు,  తమిళ,  కన్నడ,  మలయాళ,  హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది. ఆగస్టు 25వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించింది సినిమా యూనిట్. ఈ రోజు కూడా వరంగల్లో ఈ సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్ జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన రిలేషన్షిప్ గురించి విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరితో రిలేషన్ షిప్ లో ఉన్నా అనే విషయం చెప్పి ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించాలనుకోవడం లేదని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.


నా పర్సనల్ రిలేషన్స్ గురించి అందరితో చెప్పడం నాకు ఇష్టం లేదన్న ఆయన ఒక నటుడిగా పబ్లిక్ లైఫ్ లో ఉండడానికి నాకు ఇష్టం ఉన్నా పబ్లిక్ లో ఫోకస్ కావడం ఆమెకు నచ్చకపోవచ్చు కదా అంటూ కామెంట్ చేశారు. ఆమె స్వేచ్ఛకు భంగం కలగడం కూడా నాకు ఇష్టం లేదని అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. అయితే విజయ్ దేవరకొండ రష్మిక మందనతోనే రిలేషన్ లో ఉన్నట్టు ఇన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి ఈ కామెంట్స్ తో బ్రేకులు వేసినట్లయింది.


ఎందుకంటే పబ్లిక్ లైఫ్ ఆమెకి ఇష్టం లేదని చెప్పడం ద్వారా ఆమె ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాకపోవచ్చు అని ఆయన చెప్పినట్టు అయింది. అంతేకాక ఈ సినిమా కోసం తాను అనేక త్యాగాలు చేశానని ఫిట్నెస్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నానని ముఖ్యంగా మందు తాగడం మానేశానని కూడా విజయ్ దేవరకొండ కామెంట్ చేశాడు. ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


Also Read: Akshay Kumar: ఆ దెబ్బతోనే కెనడా పౌరసత్వం.. దేశం వదిలి పోవాలనుకున్నా.. అసలు విషయం బయటపెట్టిన అక్షయ్


Also Read: Anasuya Bharadwaj: ఆ ఊబిలో నుంచి అందుకే బయటపడ్డా.. జబర్దస్త్ వీడడంపై అనసూయ సంచలన వ్యాఖ్యలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి