Vijay devarakonda, Samantha's next movie title is Kushi: 'రౌడి హీరో' విజ‌య్ దేవ‌ర‌కొండ వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో నటించిన పాన్‌ ఇండియా సినిమా 'లైగర్‌' విడుదలకు సిద్ధంగా ఉండగా.. పూరీతో 'జనగనమణ' మూవీ ఒప్పుకున్నాడు. మరోవైపు నిన్నకోరి, మజిలీ, టక్ జగదీశ్ సినిమాలు చేసిన శివ నిర్వాణ దర్శకత్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజ‌య్ దేవ‌ర‌కొండ, సమంతల సినిమా నుంచి సోమవారం ఓ అప్‌డేట్‌ వచ్చింది. సినిమా టైటిల్‌తో పాటు రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించారు చిత్ర బృందం. సినిమాకు 'ఖుషి' టైటిల్‌ను ఖరారు చేసినట్టు మేకర్స్ పోస్టర్‌ ద్వారా చెప్పారు. పోస్టర్‌లో విజయ్‌ డ్రెస్సుకు సమంత చీరకు ముడివేసినట్లుగా ఉంది. విజ‌య్ సిగరెట్ తాగుతూ కూల్ లుక్‌లో ఉండ‌గా.. స‌మంత పెళ్లి కూతురు గెటప్‌లో నవ్వుతూ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.



ఇక ఖుషి సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్‌ 23న క్రిస్టమస్ కానుకగా రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాశ్మీర్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న‌ ఖుషి సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ ఆర్మీ ఆధికారిగా క‌నిపించనున్నాడని సమాచారం. మైత్రీ మూవీస్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాని వై రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని నిర్మిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భూమిక హీరోహీరోయిన్లుగా ఇదివరకే ఖుషి పేరుతో సినిమా వచ్చిన విషయం తెలిసిందే.  


Also Read: Ormax Media Survey: టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరో హీరోయిన్లు ఎవరో తెలుసా


Also Read: OTT Platforms: ఓటీటీల మధ్య పెరుగుతున్న పోటీ, థియేటర్ల సంగతి ముగిసినట్టేనా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.