Vijay Devarakonda shoots with Mike Tyson for Liger in US: హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం నటిస్తోన్న మూవీ లైగ‌ర్. పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. బాక్సింగ్ (Boxing) నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో విజ‌య్‌దేవ‌ర‌కొండ‌ స‌రికొత్త పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇక విజయ్‌ (Vijay) ఈ మూవీలో ప్రపంచ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ తో కలిసి న‌టించ‌డం విశేషం. దీపావ‌ళి (Diwali) సంద‌ర్భంగా లైగ‌ర్ మూవీలోని మైక్ టైస‌న్ (Mike Tyson) లుక్‌ రిలీజైంది. అందుకు విశేష స్పందన వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక లైగ‌ర్ మూవీ తాజా షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్ చేశారు. ఈ నెల 12వ తేదీన టీమ్ అమెరికా (America) చేరుకుంది. ప్ర‌స్తుతం మైక్ టైస‌న్, విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌ధ్య యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారట. తాజాగా అమెరికా షెడ్యూల్‌లో మైక్‌టైసన్‌ని (Mike Tyson) కలుసుకున్నాడు విజయ్‌ దేవరకొండ. మైక్‌టైసన్‌తో పని చేయడంపై చాలా సంతోషం వ్యక్తం చేశారు విజయ్. మైక్‌టైసన్‌తో కలిసి దిగిన ఫోటోను కూడా విజయ్ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ మెమోరీస్ జీవితాంతం గుర్తుంచుకుంటాన‌ని విజయ్ పేర్కొన్నాడు.



 


Also Read : Samantha Remuneration: 'పుష్ప'లో ఐటెం సాంగ్ కోసం రూ.1.5 కోట్లు తీసుకుంటున్న సమంత..??


ఈ షెడ్యూల్‌లో మూవీ క్లైమాక్స్‌ను షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది. రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ లైగర్‌ (Liger) మూవీలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. పూరీ జ‌గ‌న్నాథ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే (Ananya pandey) ఇలా మొత్తం యూనిట్‌కు లైగ‌ర్ తొలి పాన్ ఇండియా మూవీ. ఈ మూవీపై రోజురోజుకు అంచ‌నాలు పెరుగుతూనే ఉన్నాయి.


Also Read : Supreme Court: ఆలయ వ్యవహారాలు సుప్రీంకోర్టు పరిధిలో రావు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook