Samantha Remuneration: 'పుష్ప'లో ఐటెం సాంగ్ కోసం రూ.1.5 కోట్లు తీసుకుంటున్న సమంత..??

వరుస సినిమాలకు సైన్ చేస్తూ.. హీరోయిన్ సమంత ఫుల్ బిజీగా మారిపోయింది. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేయనున్న సమంత భారీ రెమ్యునరేషన్ తీసుకోనుందని హాట్ టాపిక్.. ఈ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో తెగ వైరలయ్యింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2021, 12:45 PM IST
  • ఐటెం సాంగ్ లకు కూడా ఒకే చెప్తున్న ఆపిల్ బ్యూటీ
  • పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ కు భారీ రెమ్యునరేషన్
  • ఏకంగా రూ. 1.5కోట్లు తీసుకోనుందని సమాచారం
Samantha Remuneration: 'పుష్ప'లో ఐటెం సాంగ్ కోసం రూ.1.5 కోట్లు తీసుకుంటున్న సమంత..??

 Samantha Shocking Remuneration for Item Song: నాగ చైతన్యతో (Nagachaitanya) విడాకులు తరువాత సమంత (Samantha) వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ కెరీర్ పై దృష్టి సారించింది. వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా అన్ని విధాల ఆచూతూచి అడుగులు వేస్తున్న సమంత ఇటీవలే "శాకుంతలం" (Shakunthalam) సినిమా షూటింగ్  చేసింది. ప్రస్తుతం సమంత ఐటెం సాంగ్ లకు కూడా ఒకే చెప్తుంది.

అల్లు అర్జున్ - సుకుమార్ (Allu Arjun - Sukumar Combo) కాంబో లో  రష్మికా మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్  నటిస్తున్న 'పుష్ప' (Pushpa) సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో మైత్రి మూవీ  మరియు ముత్తం శెట్టి మీడియా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే! 


 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Also Read: Corona Update in India:భారీగా తగ్గిన కరోనా కేసులు.. గడిచిన 287 రోజుల్లో ఇదే అత్యల్పం

రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ (Samantha Item Song) ఓకే  చెప్పిన సంగతి తెలిసిందే.. అయితే ప్రస్తుతం ఈ ఒక్క పాట కోసం సమంత తీసుకుంటున్న రెమ్యునరేషన్ కు సినీ వర్గాలు నోరెళ్లబెడుతున్నాయి. 

ప్రస్తుతం సమంత రెమ్యునరేషన్ నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. ఈ ఒక్క స్పెషల్  సాంగ్ కోసం ఏకంగా రూ. 1.5 కోట్లు తీసుకుంటుందట. ఇదే నిజం అయితే.. సమంత రేంజ్ పెరిగినట్టే.. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మంది స్టార్ హీరోయిన్లు ఐటెం సాంగ్స్ చేసినప్పటికీ ఇంత రెమ్యునరేషన్  మాత్రం ఎవ్వరు తీసుకోలేదు. 

Also Read: 10 digit Mobile Number: అవును.. ఫోన్ నంబర్ 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటుంది..? పదండి తెలుసుకుందాం

కాజల్ (Kajal), తమన్నా (Tamanna Bhatia), పూజా హెగ్డే (Pooja Hegde) వంటి స్టార్ హీరోయిన్ లు ఐటెం సాంగ్ లో కనువిందు చేసినప్పటికీ... ఇంత మొత్తం రెమ్యునరేషన్ మాత్రం తీసుకోలేదు. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే ఐటెం సాంగ్ రెమ్యునరేషన్ లలో సమంత కొత్త రికార్డ్ సృష్టించిందనే చెప్పాలి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News