Vijay Devarakonda for Masooda Trailer : లైగర్ సినిమా తరువాత విజయ్ దేవరకొండ బయట ఎక్కువగా కనిపించడం లేదు. సోషల్ మీడియాలోనూ అంత యాక్టివ్‌గా ఉండటం లేదు. తన తదుపరి చిత్రాలను లైన్‌లో పెట్టే బిజీలో ఉన్నాడు. అయితే ఈ క్రమంలోనే మసూద ట్రైలర్‌ను విడుదల చేసేందుకు ముందుకు వచ్చాడు. మసూద కోసం బయటకు వచ్చిన విజయ్ దేవరకొండ అందరినీ ఆశ్చర్యపరిచాడు.ఎంతో సింపుల్‌గా, స్టైలీష్‌గా విజయ్ దేవరకొండ కనిపించాడు. ఇక మసూద ట్రైలర్‌ను లాంచ్ చేసిన తరువాత విజయ్ ఆశ్చర్యపోయాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మసూద ట్రైలర్‌ను చూసిన విజయ్.. వాట్టే గ్రేట్ ట్రైలర్.. అద్భుతం, చూస్తుంటే ఎగ్జయిటింగ్‌గా ఉంది అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. ఈ సినిమాకు నా పూర్తి మద్దతు ఉంటుంది అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు మన రౌడీ హీరో. ఈ చిత్ర టీమ్‌లో తనకు చాలా మంది తెలుసని విజయ్ అన్నాడు. చిత్ర హీరో తిరు అయితే తన మొదటి సినిమా నుంచి తెలుసుని నాటి విషయాలను గుర్తు చేసుకున్నాడు. 


 



నగేష్ అయితే ‘పెళ్లిచూపులు’ సినిమా కెమెరామెని అని చెప్పుకొచ్చాడు అంతే కాకుండా.. ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఓ షెడ్యూల్ అతను చేశాడంటూ నాటి విషయాలు చెప్పుకొచ్చాడు. తన సక్సెస్‌కి అతను కూడా ఓ కారణమని గుర్తు చేసుకున్నాడు. రాహుల్ అయితే ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాను మా నవీన్‌తో నిర్మించాడు.. మళ్లీ ఇప్పుడు ఇలా కొత్త వారితో సినిమా చేస్తున్నాడంటూ నిర్మాత గురించి చెప్పుకొచ్చాడు.


ఇక ఈ చిత్రంతో సాయికిరణ్ డైరెక్టర్‌గా పరిచయం కాబోతోన్నాడని విజయ్ అన్నాడు. ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం అంటే తనకెంతో ఇష్టమని, నవంబర్ 18న ‘మసూద’ సినిమా థియేటర్లలోకి వస్తుందని చెప్పుకొచ్చాడు విజయ్. ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. భయపెడుతుంది కూడా అని ట్రైలర్ గురించి విజయ్ తన స్టైల్లో రివ్యూ ఇచ్చాడు.


‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఇప్పుడు మసూద అంటూ ముచ్చటగా మూడో సారి రాబోతోన్నాడు. ఈ మూవీ మీదున్న నమ్మకంతో దిల్ రాజు విడుదల చేసేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.


Also Read : Childrens Day 2023 : ఈ క్యూట్ ఫోటోల్లో ఉన్న హీరోయిన్లు ఎవరు?..బుల్లితెరపై చెలరేగే బుల్లి భామలు ఎవరంటే?


Also Read : వారంలో పెళ్లనగా నాగశౌర్యకు అస్వస్థత.. హుటాహుటిన హాస్పిటల్ కు తరలింపు!


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook