Family Star OTT: ఆ రూమర్స్‌కు చెక్.. అక్కడ నెంబర్ వన్ ట్రెండింగ్‌లో విజయ్ దేవరకొండ `ఫ్యామిలీ స్టార్` మూవీ..
The Family Star OTT Responce: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `ది ఫ్యామిలీ స్టార్`. ఈ నెల 5న విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ అట్రాక్ట్ చేయడంలో అంతగా మెప్పించ లేకపోయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాపై కొన్ని ట్రోల్స్ వచ్చినా.. ప్రస్తుతం అక్కడ నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
The Family Star OTT Responce: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్'. ఈ మధ్యే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ముందుగా ఈ సినిమాలోని కొన్ని సీన్స్ పై ట్రోల్స్ వచ్చినా.. తాజాగా ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాకు మొదటి రోజే దారుణమైన టాక్ రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కుదేలైంది. తాజాగా ఓటీటీ వేదికగా ఈ సినిమా పై పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు నెటిజన్స్. విజయ్, మృణాల్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. హీరో తన గురించి ఆలోచించుకోకుండా ఫ్యామిలీ కోసం నిలబడటం ఇన్ స్పైరింగ్ గా ఉందంటూ మెచ్చుకుంటున్నారు.
కొందరు కావాలని చేసిన నెగిటివ్ ప్రచారంలోనూ విజయ్ క్రేజ్ తో ఫ్యామిలీ స్టార్ సినిమా మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు రీచ్ అయ్యిందనే కామెంట్స్ వినబడుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ అందుకుంది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ తర్వాత అక్కడ నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. భారత్‌లోనే కాదు అమెరికాలోనూ ఫ్యామిలీ స్టార్ సినిమాను ప్రైమ్ వీడియోలో చూస్తున్నవారు సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
మిగతా సినిమాల్లాగే ఫ్యామిలీ స్టార్ లోనూ కొన్ని మిస్టేక్స్ ఉన్నా సినిమా మిగతా అన్ని అంశాల్లో బాగుందని చెబుతున్నారు. ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రెస్పాన్స్ తో సోషల్ మీడియా నెగిటివ్ ప్రాపగండా నమ్మొద్దనే రియలైజేషన్ ఆడియన్స్‌లో కలుగుతోంది. ఇది విజయ్ దేవరకొండ నెక్ట్ సినిమాలకు తప్పకుండా ఉపయోగపడుతుందా అనేది చూడాలి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ సినిమాపై విజయ్ దేవరకొండ ఆశలు పెట్టుకున్నాడు.
Also read: Janasena Glass Symbol: రెబెల్స్‌కు గాజు గ్లాసు గుర్తు, కూటమి అభ్యర్ధుల్లో ఆందోళన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook