ED Questioned Vijay Devarakonda : లైగర్ సినిమా పెట్టుబడుల విషయంలో ఈడీ అధికారులు కన్ను వేసిన సంగతి తెలిసిందే. వాటికి వెనుక టీఆర్ఎస్ నాయకులున్నారనే అనుమానాలను వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారట. దీంతో ఈ ఈడీ అధికారులు లైగర్ యూనిట్‌ను ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలోనే గత రెండు వారాల క్రితం పూరి, చార్మీలను ఈడీ విచారించింది. ఇక నిన్న అంటే బుధవారం నాడు దాదాపు పది నుంచి పన్నెండు గంటలు విజయ్ దేవరకొండను ఈడీ విచారించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈడీ విచారణ అనంతరం విజయ్ దేవరకొండ మీడియాతో తన స్టైల్లో మాట్లాడాడు. పది గంటల నుంచి పన్నెండు గంటల పాట ఈడీ విచారించిందని, వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని చెప్పుకొచ్చాడు. జీవితంలో ఇవన్నీ ఓ భాగమని వేదాంత ధోరణిలో మాట్లాడాడు. మీరు ఇచ్చిన ప్రేమ వల్ల వచ్చిన పాపులారిటీ ద్వారా.. ఇలాంటివి జరుగుతుంటాయి.. ఇవి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. మళ్లీ రమ్మని పిలవలేదని, పిలిస్తే వస్తాను అన్నట్టుగా చెప్పుకొచ్చాడు విజయ్.


లైగర్ సినిమా ఫ్లాప్ అయినా కూడా పూరి, విజయ్ మెడకు మాత్రం ఈ చిక్కులు తప్పడం లేదు. విజయ్, పూరిలకు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో పాటు, పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్ వస్తుందని అంతా అనుకున్నారు. విజయ్ కూడా మరీ ఓవర్ కాన్ఫిడెంట్‌తో ఉన్నాడు అదే అతని కొంప ముంచినట్టుంది. చివరకు లైగర్ దారుణంగా బెడిసి కొట్టేసింది.


లైగర్ ఫ్లాపుతో పూరి, విజయ్ కెరీర్‌లు అగమ్యగోచరంగా మారింది. విజయ్ ఖుషి సినిమా ఆగింది. సమంత ఆరోగ్యం బాగుపడేంత వరకు ఖుషి ముందుకు కదలదు. విజయ్ అయితే పూరి జన గణ మనను అటకెక్కించాడు. దీంతో పూరి చేతులో ఇంకో సినిమా లేకుండా పోయింది. విజయ్ కూడా నెక్ట్స్ ప్రాజెక్ట్ త్వరగా పట్టాలెక్కించాలని బాగానే ఆరాటపడుతున్నాడు.


Also Read : Adivi Sesh HIT 2 Collections : HIT 2 ప్రభంజనం.. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రికార్డ్.. వసూళ్ల వర్షం


Also Read : Nara Brahmani Bike Riding : బాలయ్య కూతురా? మజాకా?.. బైక్ రైడర్‌గా నారా బ్రహ్మణి యాత్ర


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook