Liger Movie Collections: డిజాస్టర్ టాక్ తో కూడా దుమ్ము రేపిన లైగర్ మూవీ.. ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే?
Vijay Devarakonda`s Liger Movie Day 1 World Wide Collections: మొదటి రోజు లైగర్ సినిమా ఎంత కలెక్ట్ చేసింది? ఏరియాల వారీగా ఎన్ని కోట్లు వసూలు చేసింది అనే వివరాల్లోకి వెళితే.
Vijay Devarakonda's Liger Movie Day 1 World Wide Collections: విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రూపొందిన తాజా చిత్రం లైగర్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా అనన్య పాండే నటించగా కీలక పాత్రలలో విషు రెడ్డి, రమ్యకృష్ణ, మైక్ టైసన్, అలీ, మకరంద దేశ పాండే వంటి వారు నటించారు. ఇక ఈ సినిమాని ధర్మ ప్రొడక్షన్స్- పూరీకనెక్స్ బ్యానర్ల మీద కరణ్ జోహార్, అపూర్వ మెహతా, పూరి జగన్నాథ్, చార్మి కౌర్ సంయుక్తంగా నిర్మించారు.
పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా అనగానే సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగిన విధంగానే ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేయడంతో సినిమా మీద తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ప్రేక్షకులలో కూడా విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. విపరీతమైన అంచనాల నడుమ ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆగస్టు 25వ తేదీన విడుదలైంది. ఇక ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి కూడా డివైడ్ టాక్ తెచ్చుకుంది.
మెజారిటీ ఈ సినిమా బాగాలేదని అంటుంటే కొంతమంది మాత్రం బాగానే ఉందంటున్నారు. అయితే ఇలాంటి టాక్ నేపథ్యంలో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. మొదటి రోజు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది? ఏరియాల వారీగా ఎన్ని కోట్లు వసూలు చేసింది అనే వివరాల్లోకి వెళితే. ఈ సినిమా నైజాంలో నాలుగు కోట్ల 24 లక్షల రూపాయల వసూళ్లు సాధించింది. సీడెడ్ ప్రాంతంలో కోటి 32 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో కోటి 27 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 64 లక్షలు, వెస్ట్ గోదావరిలో 39 లక్షలు, గుంటూరులో 83 లక్షలు, కృష్ణా జిల్లాలో 48 లక్షలు, నెల్లూరు జిల్లాలో 40 లక్షలు వసూళ్లు సాధించింది.
మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 9.57 కోట్లు వసూలు చేయగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 13.45 కోట్లు షేర్ కలెక్ట్ చేయగా 24.30 కోట్లు గ్రాస్ వసూలు సాధించింది. ఇక ఈ సినిమా బిజినెస్ లెక్కలతో 90 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా నిర్ణయించారు. ఇక 76.55 కోట్లు వసూళ్లు సాధిస్తేనే హిట్ గా నిలుస్తుంది.
Also Read: Trisha Clarity on Politics: రాజకీయాల్లోకి త్రిష.. క్లారిటీ ఇచ్చేసిందిగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి