Venu swamy Comments on Vijay Devarakonda: వేణుస్వామి చెప్పిందే నిజమయింది.. లైగర్ దెబ్బతో మళ్ళీ వైరల్ అవుతున్న కామెంట్స్!

Astrologer Venu swamy Sensational Comments Viral on Vijay Devarakonda: విజయ్ దేవరకొండ జాతకం గురించి వేణు స్వామి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 26, 2022, 10:10 AM IST
Venu swamy Comments on Vijay Devarakonda: వేణుస్వామి చెప్పిందే నిజమయింది.. లైగర్ దెబ్బతో మళ్ళీ వైరల్ అవుతున్న కామెంట్స్!

Astrologer Venu swamy Sensational Comments Viral on Vijay Devarakonda: విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రూపొందిన లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మొదటి ఆట నుంచి చాలా డివైడ్ టాక్ తెచ్చుకుంది. సినిమా చాలా మందికి నచ్చలేదని కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది మాత్రం సినిమా పర్వాలేదని, బాగుందని కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపద్యంలో విజయ్ దేవరకొండను తొక్కుతున్నారు అని, దానికోసమే కొంతమంది హీరోలు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారనే వార్తల నేపధ్యంలో గతంలో విజయ్ దేవరకొండ జాతకం గురించి అతని కెరీర్ గురించి సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

విజయ్ దేవరకొండను తెలంగాణ మెగాస్టార్ అని యాంకర్ అభివర్ణించగా విజయ్ దేవరకొండకు అంత సీన్ లేదని వేణు స్వామి గాలి తీసేశారు. విజయ్ దేవరకొండది మరో ఉదయ్ కిరణ్ లాంటి జాతకం అని అతనిది పెద్ద తోపు జాతకం ఏమీ కాదని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఏదో అనుకోకుండా హిట్లు వచ్చాయని ఇప్పుడు వరుస ఫ్లాప్ సినిమాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. కాకపోతే ఈ వీడియో లైగర్ సినిమా విడుదలకు చాలా రోజుల ముందే చేసిన వీడియో కావడంతో చివరి సినిమాగా వరల్డ్ ఫేమస్ లవర్ గురించి ఆయన ప్రస్తావించారు.

గత ఏడాది జనవరి నుంచి ఆయనకు అష్టమ శని స్టార్ట్ అయిందని చాలా దారుణమైన పరిస్థితుల్లోకి వెళతాడని విజయ్ దేవరకొండ జాతకం ఒక పెద్ద హీరోతో కంపేర్ చేయగలిగిన జాతకమే కాదని వేణు స్వామి కుండ బద్దలు కొట్టారు. ఆయనను తొక్కేస్తున్నారని ఆయన అభిమానులు అంటున్నారు అంటే అసలు ఆయనను తొక్కేసే అవసరం ఎవరికి ఉంది? ఎందుకు తొక్కుతారు? వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఉంది, దానిని ఏమైనా ఆపారా? థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారా? అసలు ఆయనను తొక్కేసే అంత సినిమా ఆయనకు లేదు అని వేణు స్వామి అన్నారు.

నిన్నటి వరకు విజయ్ దేవరకొండ అనే అనిపించుకున్న ఆయన ఇప్పుడు విజయ్ సాయి అని పిలిపించుకుంటున్నాడని దేవరకొండ అనే పేరు వస్తే ఒక కమ్యూనిటీని రిప్రెజెంట్ చేసినట్లు అనిపిస్తుంది కాబట్టి దేవరకొండ అనే పదాన్ని పక్కన పెట్టడానికి ట్రై చేస్తున్నాడని అన్నారు. చాలామంది దేవరకొండ అంటే సీఎం కేసీఆర్ కి బంధువులు అవుతారని భావిస్తారని ఒకే కులం అయి ఉండవచ్చు కానీ వారి మధ్య బంధుత్వం లేదని చెప్పుకొచ్చారు.

ఆయన జాతకంలో అయితే ఆయన పెద్ద తోపు స్టార్ అవుతాడని ఎక్కడా లేదని, బండి ఎంత స్పీడ్ గా వచ్చిందో అంతే స్పీడుగా వెనక్కి వెళుతుందని చెప్పుకొచ్చారు. అరవిందస్వామి, ఉదయ్ కిరణ్, కునాల్, అబ్బాస్ వంటి హీరోలు ఎలా అయితే ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చి తర్వాత కనపడకుండా పోయారో విజయ్ దేవరకొండ కూడా వారిలాగే కనపడకుండా పోతాడంటూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు పెద్ద హీరో అయ్యే జాతకమే లేదని విజయ్ దేవరకొండ గురించి వేణు స్వామి కామెంట్లు చేశారు. గతంలో ఆయన చేసిన కామెంట్స్ దెబ్బకి లైగర్ ఫలితం నిదర్శనం అని కొందరు కామెంట్ చేస్తున్నారు. 

Also Read: Trisha Clarity on Politics: రాజకీయాల్లోకి త్రిష.. క్లారిటీ ఇచ్చేసిందిగా!

Also Read: Movie Shootings Started: ఎమర్జన్సీ కోటాలో టాలీవుడ్ షూటింగ్స్ మొదలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News