Family Star: ఫ్యామిలీస్టార్ కి తప్పని కష్టాలు…జూ.ఎన్టీఆర్ పై ఆధారపడ్డ విజయ్ దేవరకొండ..
Vijay Devarakonda: వరుస ప్లాపులతో సతమతమవుతున్న విజయ్ ఫ్యామిలీ స్టార్.. మూవీ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మొన్న సంక్రాంతి రేస్ కు రావలసిన ఈ చిత్రం అనుకోకుండా వాయిదా పడింది. మరి ఇప్పుడు ఈ మూవీ నెక్స్ట్ రిలీజ్ డేట్ దేవర విడుదల తో లింక్ అయి ఉంది…
Devara: ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆరంభ దశలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మెల్లిగా స్టార్ హీరో స్టేటస్ తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు అనే మూవీతో విజయ్ సక్సెస్ఫుల్ హీరోగా మారాడు. ఈ మూవీ యూత్ లో బాగా క్రేజ్ సంపాదించడంతో విజయ్ దేవరకొండ కి యూత్ హీరోగా పేరు వచ్చింది. ఇక ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. వరుస క్రేజీ హిట్స్ అతని ఖాతాలో పడడంతో మంచి స్టార్ స్టేటస్ అందుకున్నాడు.
సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు విజయ్ దేవరకొండ. కానీ ఈ మధ్యకాలంలో అతను వరుస ప్లాపులతో బాధపడుతున్నాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన లైగర్, ఖుషి చిత్రాలు తీవ్రమైన నిరాశను మిగిల్చాయి. ఈసారి ఎలాగన్నా మంచి సక్సెస్ కొట్టాలి అనే లక్ష్యంతో ఫ్యామిలీ స్టార్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఫిక్స్ అయ్యాడు. గీత గోవిందం లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తనకు అందించిన పరశురామ్ దర్శకత్వంలో విజయ్ ఈ మూవీని చేస్తున్నాడు. అందుకే ఆరంభం నుంచే ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
దీనికి తోడు మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ విడియో లో ‘ఇనమే వంచాల ఏంటి?’..’అయ్యో బాబాయ్ కంగారులో కొబ్బరికాయ మర్చిపోయాను అందుకే తలకాయ కొట్టేసాను..’లాంటి పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ బాగా పెంచాయి. అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు అని టాక్. డిసెంబర్ నెలలోనే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయింది. వీలైనంత త్వరగా మిగిలిన పార్టీని కూడా పూర్తి చేసి ఈ సంక్రాంతికి ఈ సినిమాని బరిలో దింపడానికి చిత్ర బృందం ప్రయత్నాలు చేసింది. అయితే అనుకోకుండా సడన్ గా రేస్ నుంచి తప్పకుంది.
ఇక మూవీని విడుదల చేయబోయే డేట్స్ గురించి సోషల్ మీడియాలో తెగ డిస్కషన్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో చాలా డేట్లు తెరపైకి వచ్చాయి.. అయితే ఇంకా చిత్ర బృందం దీని గురించి క్లారిటీ ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మూవీ విడుదలకు సంబంధించి ఓ చిన్ని న్యూస్ వైరల్ అవుతుంది. ఈ చిత్రం మార్చి 28న వేసవి సెలవల సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు సమాచారం. ఒకవేళ ఎన్టీఆర్ దేవర చిత్రం వాయిదా పడితే ఈ మూవీ ఏప్రిల్ 5న విడుదల అయ్యే అవకాశం ఉంది. ఎలక్షన్స్ వల్ల జూనియర్ ఎన్టీఆర్ సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని వార్త వినిపిస్తోంది. అంతేకాకుండా నిన్న సైఫ్ ఆలీ ఖాన్ కి షూటింగ్లో గాయాలు తగలడం వల్ల ఈ చిత్ర షూటింగ్ కూడా వాయిదా పడే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి ఈ పోస్ట్ పోన్ ఉపయోగించుకొని జూనియర్ ఎన్టీఆర్ డేట్ ని తీసుకుందాం అని చూస్తున్నారట విజయ్ దేవరకొండ టీమ్.
ప్రస్తుతం తెలుగు సినిమాలకి రిలీజ్ డేట్స్ కష్టాలు చాలానే కొనసాగుతున్నాయి. సంక్రాంతి సినిమాల వల్ల ఎన్నో చిత్రాలు అనుకోకుండా ప్రీపోన్, పోస్ట్ పోన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఫ్యామిలీ స్టార్ డేట్ కన్ఫామ్ అవ్వాలి అంటే దేవర డేట్ పై స్పష్టత రావాలి అని అర్థమవుతోంది.
Also Read: Bike Buys with Coins: పూజారి "చిల్లర ప్రేమ" కథ వినండి.. వీరి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook