Rashmika deep fake video: రష్మిక మందాన దీప్ ఫేక్ వీడియో గత రెండు రోజుల నుంచి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.  బ్రిటీష్ ఇండియన్ అమ్మాయి జారా పటేల్ వీడియో లో ఏఐ టెక్నాలజీ ద్వారా రష్మిక మొహం పెట్టి .. కొంచెం అసభ్యంగా ఉన్న ఆ వీడియోని సోషల్ మీడియాలో వదిలారు ఆకతాయిలు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేయగా దానిపైన అమితాబ్ బచ్చన్ సైతం వ్యతిరేకత వ్యక్తం చేశారు. అలాంటి వారిని పై తప్పకుండా తగిన యాక్షన్ తీసుకోవాలని అమితాబ్ కోరారు.


ఇక ఆ తరువాత బాలీవుడ్, టాలీవుడ్ సెలెబ్రిటీలంతా కూడా రష్మిక ఫేక్ వీడియో మీద స్పందించారు. ఇలాంటి వాళ్లని వెంటనే శిక్షించాలని ఇలాంటివి ఎక్కువ అయితే అమ్మాయిలకు రక్షణ ఉండదు అంటూ కామెంట్లు పెట్టసాగారు. ఏఐ టెక్నాలజీ వల్ల ఎంతటి నష్టం వాటిల్లనుందో అంటూ భవిష్యత్తు మీద ఆందోళన వ్యక్తం చేశారు.


కాగా ఈ వీడియో బయటకి వచ్చిన కొద్దిసేపట్లోనే అందరిని కలవరపరచగా.. ఈ ఘటన మీద కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఈ వీడియో గురించి అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలను హెచ్చరించింది. వెంటనే ఈ వీడియోని సోషల్ మీడియా ప్లాట్ ఫర్మ్స్ నుంచి తొలగించాలి అని అలానే ఇలాంటి వీడియోలు ఇంకెప్పుడూ షేర్ చేయకూడదు అని హెచ్చరించింది.
మరో 36 గంటల్లో అసలు ఆ వీడియో కనిపించకూడదు అని ప్రభుత్వం ఆర్థర్ వేసింది.


ఈ నేపథ్యంలో విజయ దేవరకొండ కూడా స్పందించారు. విజయ దేవరకొండ, రష్మిక మందాన కలిసి గీతగోవిందం డియర్ కామ్రేడ్ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు వీరి మధ్య ప్రేమ ఉంది అని కూడా కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఇక తాజాగా విజయ దేవరకొండ ఇలా ట్రెండ్ అవుతున్న రష్మిక వీడియో పైన స్పందించడంతో ప్రస్తుతం ఆయన వేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.


' ఇలాంటి నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం.. మరోసారి ఇంకో మహిళకు ఇలాంటి ఘటన జరగకూడదు. అంతేకాదు ఇక పైన ఇలాంటి వాటి మీద వెంటనే చర్యలు తీసుకునేందుకు ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలి.. వెంటనే శిక్షించాలి.. అప్పుడు మహిళలు రక్షించబడతారు' అని విజయ్ రష్మిక వీడియో పైన స్పందించారు.


కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ గీతాగోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేస్తోంది.


Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…


Also Read: Redmi 13C Price: అదిరిపోయే ఫీచర్స్‌తో డెడ్‌ చీప్‌ ధరతో మార్కెట్‌లోకి Redmi 13C మొబైల్‌..స్పెసిఫికేషన్స్‌ ఇవే..  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook