Vijay Deverakonda : 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యంగ్ హీరో విజయ్ దేవరకొండ గత కొంతకాలం గా వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్నారు. ఈమధ్య విజయ్ దేవరకొండ తన సినిమాలు అన్నిటికీ భారీ హైప్ ఇస్తున్నాడు కానీ విడుదల తర్వాత మాత్రమే సినిమాలు ఆ హైప్ ని అందుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడుతున్నాయి. 


తాజాగా సమంత హీరోయిన్ గా నటించిన ఖుషి సినిమాతో పర్వాలేదు అనిపించినా విజయ్ దేవరకొండ ఒక బ్లాక్ బస్టర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన ఆశలన్నీ ది ఫ్యామిలీ స్టార్ సినిమా పైన పెట్టుకున్నారు. విడుదల కి ముందు రోజు వరకు విజయ్ దేవరకొండ తో కలిసి చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా సినిమాని భారీ స్థాయిలో ప్రమోట్ చేసారు. 


సినిమా మీద ఎవరో ఒక వర్గం కావాలి అని నెగటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు అని ఆధారాలతో సహా అభిమానులు సైబర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. కానీ దీనివల్ల జరిగేది ఏమీ లేదు. సినిమా మొదటి రోజు నుంచి డిజాస్టర్ టాక్ నే అందుకుంది. దాని సంగతి పక్కన పెడితే అసలు విజయ్ దేవరకొండ సినిమా విడుదలైన రోజు నుంచి కెమెరాకి దూరం అయిపోయాడు.


ఏప్రిల్ 5 నుంచి విజయ్ దేవరకొండ ఎక్కడా కనిపించడం లేదు. ఏమో కారణాలవల్ల తను ఇండియాలో లేదు అని కొందరు చెబుతున్నారు కానీ ఎక్కడ ఉన్నా కనీసం సోషల్ మీడియాలో అయినా విజయ్ దేవరకొండ యాక్టివ్ గా ఉండచ్చు. ఫ్యామిలీ స్టార్ కోసం ఏప్రిల్ 2న మృణాల్ ఠాకూర్ తో పాటు గ్రూప్ ఫోటోలు షేర్ చేసిన విజయ్ మూడు రోజుల క్రితం ఫ్యామిలీ స్టార్ రిలీజ్ సందర్భంగా నాన్నకు విషేస్ తెలిపారు అంతే. 


సినిమా రిజల్ట్ ముందే తనకి అర్థమైపోయింది అని అందుకే విజయ్ మౌనంగా ఉండాలని ఫిక్స్ అయ్యాడు అని కొందరు అంటున్నారు. సినిమా హిట్టయినా ఫ్లాపయినా కనీసం ఒక వారం రోజలు అయినా తమ సినిమా గురించి విజయ్ దేవరకొండ చెప్తే బాగుండేది అని, అల కాకుండా ఇలా దూరంగా ఉండిపోవడం దీనికి సంకేతం అని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. 


ఒకపక్క దిల్ రాజు సినిమా బావుంటుంది అని చెబుతూనే ఉన్నారు. కనీసం ఆ వీడియో లను రీ-షేర్ చేసినా ప్రమోషన్ లాగా బాగానే ఉంటుంది. కానీ విజయ్ దేవరకొండ కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూలకు మాత్రమే పరిమితమై సినిమా విడుదలయ్యాక అదృశ్యమైపోతున్నారు. కాగా మరికొందరేమో విజయ్ దేవరకొండ రష్మిక బర్తడే సెలబ్రేషన్స్ సందర్భంగా వేరే కంట్రీ కి వెళ్ళిపోవడంతో ప్రమోషన్స్ లో భాగం కాలేదని చెబుతున్నారు. అయితే కనీసం విజయ్ కనీసం వీడియోల ద్వారా ట్విట్టర్ ద్వారా అన్న ఈ సినిమాని కొంచెం ప్రమోట్ చేస్తే  మినిమం కలెక్షన్స్ అన్న వస్తాయేమో. మొత్తానికి ఫ్యామిలీ స్టార్ ఈ అన్ని కారణాల మధ్య డిజాస్టర్ వైపు పరుగులు తీస్తోంది.


Also Read: Revanth Reddy Flight: రేవంత్‌ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం ...


Also Read: TS Weather: తెలంగాణ ప్రజలకు ఎండల నుంచి ఊరట.. రాగల మూడు రోజులు వర్షాలు



 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter