Vijay deverakonda remuneration for liger movie: రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతి తక్కువ టైంలోనే టాలీవుడ్ లోనే బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. పెళ్లి చూపులుతో మెుదలైన విజయ్ (Vijay deverakonda) కెరీర్..ప్రస్తుతం ఫీక్స్ లో ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం విజయ్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh ) దర్శకత్వంలో 'లైగర్' మూవీ చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో..పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన అనన్య పాండే నటించింది. అయితే ఈ సినిమాకు విజయ్ రూ.35కోట్లు పారితోషికం (Vijay deverakonda remuneration) తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ రెమ్యునరేషన్ చూస్తే విజయ్ రేంజ్ ఏంటన్నది అర్ధమవుతుంది.


Also Read: Dhanush Aishwarya Divorce : విడిపోయిన మరో జంట.. విడాకులు తీసుకున్న ఐశ్వర్య, ధనుష్


లైగర్ సినిమా నుండి ఇటీవల వచ్చిన గ్లింప్స్, టీజర్ కేక పెట్టించాయి. బాక్సర్ గా విజయ్ దేవరకొండ దుమ్ముదులిపినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అనన్య గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. లైగర్ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ (Boxing Legend  Mike Tyson) అతిధి పాత్రలో కనపించనున్నారు. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానెర్స్ పై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, అపూర్వ మెహతా, హీరో యష్ జోహార్, పూరీ జగన్నాధ్‌లు నిర్మిస్తున్నారు. విజయ్ యాక్టింగ్..పూరీ టేకింగ్...లైగర్ ని నెక్ట్స్ లెవల్ లో ఉంచేలా చేస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Linkhttps://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook