Liger Trailer to Release On July 21st: వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ ఒక మంచి సూపర్ హిట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఆయన పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. నిజానికి షూటింగ్ ఎప్పుడో పూర్తయి సినిమా విడుదలకు కూడా సిద్ధం అయిపోయింది అనుకుంటున్న తరుణంలో మరో సాంగ్ షూట్ చేయాల్సి వచ్చింది. సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద ఛార్మి కౌర్ అలాగే ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అపూర్వ మెహతా, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది, ఆగస్టు 25వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించింది సినిమా యూనిట్. ఈ క్రమంలోనే జూలై 21వ తేదీన ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.


జూలై 21వ తేదీ ట్రైలర్ కోసం రెడీగా ఉండండి అంటూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేయడంతో విజయ్ దేవరకొండ అభిమానులు ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో ట్రైలర్ గురించి ట్రెండ్ చేయడం మొదలు పెట్టేశారు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక కిక్ బాక్సర్ పాత్రలో నటిస్తుండగా ఆయన తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. అలాగే ప్రపంచ ప్రఖ్యాత కిక్ బాక్సర్ మైక్ టైసన్ ఈ సినిమాలోకి కీలకపాత్రలో నటిస్తూ ఉండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక ఈ సినిమా పూర్తి కూడా అవకుండానే విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో జనగణమన అనే ప్రాజెక్టు ప్రకటించారు. ఆ సినిమా సెట్స్ మీదకు కూడా వెళ్లకుండానే మూడో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కానీ ఆ విషయం మీద మాత్రం పూర్తి క్లారిటీ అయితే లేదు.
Also Read: Ravi Teja In Mega 154: మెగా 154లో రవితేజ, మాస్ మహారాజా ఊర మాస్ ఎంట్రీ..ఇక రచ్చరచ్చే!


Also Read: Sushmita Sen: లలిత్ కంటే ముందు పది మందితో డేటింగ్.. హీరోలు మొదలు క్రికెటర్ దాకా.. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే?



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.