Ravi Teja In Mega 154: మెగా 154లో రవితేజ, మాస్ మహారాజా ఊర మాస్ ఎంట్రీ..ఇక రచ్చరచ్చే!

Ravi Teja Mass Entry In Mega 154:  మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాలో రవితేజ నటిస్తున్నాడనే విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 16, 2022, 06:30 PM IST
  • మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా 154
  • సినిమాలో భాగమైన రవితేజ
  • అధికారికంగా ప్రకటించిన సినిమా యూనిట్
Ravi Teja In Mega 154: మెగా 154లో రవితేజ, మాస్ మహారాజా ఊర మాస్ ఎంట్రీ..ఇక రచ్చరచ్చే!

Ravi Teja Mass Entry In Mega 154: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 154వ సినిమాగా రూపొందుతున్న సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మత్స్యకారుడు పాత్రలో నటిస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

విశాఖపట్నం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర పేరు వాల్తేరు వీరయ్యగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాలో రవితేజ కూడా ఒక పాత్రలో నటించే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు దాని మీద సరైన క్లారిటీ అయితే లేదు కానీ తాజాగా ఈ సినిమాలో రవితేజ నటిస్తున్నాడనే విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఒక 40 సెకండ్ల వీడియో విడుదల చేసిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడనే విషయాన్ని క్లారిటీ ఇచ్చేసింది.

ఇక తాజాగా అందుతున్న సమాచారం వరకు రవితేజ ఒక రోజు క్రితం అంటే శుక్రవారం నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రవితేజ కేథరిన్ థెరిసా నటించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే రవితేజ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇక తాజాగా విడుదల చేసిన వీడియోలో రవితేజ కేరవాన్ లోకి వెళుతూ ఉండగా మెగాస్టార్ చిరంజీవి లోపలికి ఆహ్వానిస్తున్నట్లు కనిపిస్తోంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

ఇక డోర్ క్లోజ్ చేసిన తర్వాత డైరెక్టర్ బాబీ కనిపిస్తూ మాస్ మహారాజా మా సినిమాలో నటిస్తున్నాడంటూ చెప్పారు. ఇక ఈ నేపథ్యంలో మెగా 154 సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి ఆ అంచనాలను సినిమా ఏమేరకు అందుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. ఇక మెగాస్టార్ ఈ సినిమాతో పాటు ఇప్పటికే గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు చేస్తున్నారు. అలాగే వేదాళం రీమేక్ భోళా శంకర్ సినిమా చేస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమాను మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా భోళా శంకర్ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు. 

Also Read: Sushmita Sen: లలిత్ కంటే ముందు పది మందితో డేటింగ్.. హీరోలు మొదలు క్రికెటర్ దాకా.. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే?

Also Read: Rashmika Mandanna: అంతా కనిపించేలా రష్మిక డ్రెస్.. అవసరమా అంటున్న నెటిజన్లు

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News