Vijay Devarakonda - Dil Raju - SVC 59:  స్టార్ హీరో విజయ్ దేవరకొండ, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్, టాలెంటెడ్ డైరెక్టర్ రవికిరణ్ కోలా కాంబినేషన్‌లో  క్రేజీ మూవీ అనౌన్స్ మెంట్ జరిగింది. 'ది ఫ్యామిలీ స్టార్' మూవీ అనుకున్నంత రేంజ్‌లో సక్సెస్‌పుల్ కాకపోయినా.. మరోసారి విజయ్ దేవరకొండతో దిల్ రాజు క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు. 'రాజా వారు రాణి గారు' సినిమాతో పరిచయమైన రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో రాబోతున్న 59వ సినిమా ఇది.
తాజాగా ఈ సినిమాను లాంఛనంగా అనౌన్స్ చేశారు. ఈ సినిమాను పూర్తిగా రూరల్ యాక్షన్ డ్రామాతో తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. మే 9న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయ్ దేవరకొండ విషయానికొస్తే.. రీసెంట్‌గా 'ఫ్యామిలీ స్టార్' మూవీతో పలకరించారు. పరశురామ్ పేట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు నెగిటివ్ ప్రచారం కొంప ముంచింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ ఈ సినిమా నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మొత్తంగా థియేటర్స్‌లో ఈ సినిమాను మిస్ అయిన వారు ఇపుడు ఓటీటీ వేదికగా ఈ సినిమాను ఆదరిస్తున్నారు. మరోవైపు  విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ సినిమాపై విజయ్ దేవరకొండ ఆశలు పెట్టుకున్నాడు. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  


Also read: Supreme Court: 'రాహుల్ గాంధీ' పేరుందని ఎన్నికల్లో పోటీ చేయోద్దంటే ఎలా ? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook