Vijay Deverakonda : గత కొంతకాలంగా యువ హీరో విజయ్ దేవరకొండ టైం ఏమాత్రం బాగోడం లేదు. ఈ హీరో చేసిన ప్రతి సినిమా బాక్స్ఆఫీస్ వద్ద చతికిలబడుతోంది. ఖుషి సినిమాతో పర్వాలేదు అనిపించిన.. విజయ్ దేవరకొండ ఈ మధ్యనే ది ఫ్యామిలీ స్టార్ సినిమా తో మరొక మర్చిపోలేని డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో వెలవెలబోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో విజయ్ దేవరకొండ తన ఆశలన్నీ తన తదుపరి సినిమా మీద పెట్టుకున్నాడు. ప్రస్తుతం విజయ్ జెర్సీ దర్శకుడు గౌతమ్ తో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ క్రమం లో జెర్సీ సినిమాతో నానికి బ్లాక్ బస్టర్ అందించిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండ కి కూడా హిట్ ఇస్తారని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ లు కూడా సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.


ఇప్పటికే ఈ సినిమా పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. స్పై థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్పై పాత్రలో కనిపించబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ పెద్ద రిస్క్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మామూలుగా తెలుగు సినిమాలు అంటే కనీసం 5 నుంచి 6 పాటలు ఉంటాయి. మరి దేశభక్తి సినిమా అనుకున్నా కూడా కనీసం రెండు మూడు పాటలైనా ఉంటాయి. కానీ గౌతమ్ తిన్ననూరితో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాలో మాత్రం కనీసం ఒక్కటంటే ఒక్క పాట కూడా ఉండదట.


ఈ సినిమాలో కేవలం నేపథ్య సంగీతం మాత్రమే ఉంటుంది అని ఒక్క పాట కూడా ఉండదని తెలుస్తోంది. సినిమా ఎంత గొప్పగా ఉన్నప్పటికీ పాటలు కూడా సినిమా రిజల్ట్ విషయంలో ఎంతో కొంత ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా విడుదల కి ముందే రిలీజ్ అయిన పాటలు సూపర్ హిట్ అయితే సినిమాపై మరింత బజ్ క్రియేట్ అవుతుంది.


కానీ తమ సినిమాలో మాత్రం ఒక్క పాట కూడా ఉండకూడదని గౌతమ్ తిన్ననూరి ఫిక్స్ అయ్యారట. సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఎటూ డీవియేట్ అవ్వకుండా కేవలం కథ మీద మాత్రమే దృష్టి పెట్టేలా ఉండడం కోసం చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకుందట. ఈ నిర్ణయం కొత్తగా.. వినడానికి బాగానే ఉన్నప్పటికీ.. అది విజయ్ దేవరకొండ కెరియర్ కి ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుంది అని చెప్పడం కష్టం. పైగా విజయ్ దేవరకొండ కి ఈ సినిమా హిట్ అవ్వడం చాలా కీలకంగా మారబోతుంది. ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండ ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ఫాన్స్ కూడా భయపడుతున్నారు. ఏదైమైనా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.


Also Read: Amit Shah: రేవంత్‌ రెడ్డిపై అమిత్‌ షా ఫైర్‌.. తెలంగాణను ఢిల్లీకి ఏటీఎమ్‌ చేశారని తీవ్ర వ్యాఖ్యలు


Also Read: KCR Live: రేవంత్ రెడ్డికి చేతకాకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నేనే రిపేర్‌ చేస్తా: కేసీఆర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter