Amit Shah: రేవంత్‌ రెడ్డిపై అమిత్‌ షా ఫైర్‌.. తెలంగాణను ఢిల్లీకి ఏటీఎమ్‌ చేశారని తీవ్ర వ్యాఖ్యలు

Will End Muslim Reservations Says Amit Shah: ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డి లక్ష్యంగా కేంద్ర మంత్రి అమిత్‌ షా తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్‌ రెడ్డి తెలంగాణను ఢిల్లీకి ఏటీఎం చేశారని ఆరోపించారు. బీజేపీకి 12 సీట్లు ఇవ్వాలని కోరారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 25, 2024, 05:38 PM IST
Amit Shah: రేవంత్‌ రెడ్డిపై అమిత్‌ షా ఫైర్‌.. తెలంగాణను ఢిల్లీకి ఏటీఎమ్‌ చేశారని తీవ్ర వ్యాఖ్యలు

Amit Shah: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తొలిసారి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డి తెలంగాణను ఢిల్లీకి ఏటీఎమ్‌గా మార్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోదీ కావాలని చెప్పారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణలో అవినీతిని రూపుమాపుతామని హామీ ఇచ్చారు.

Also Read: KCR Live: రేవంత్ రెడ్డికి చేతకాకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నేనే రిపేర్‌ చేస్తా: కేసీఆర్

మెదక్‌ లోక్‌సభ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా అమిత్‌ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించిన విజయ సంకల్ప జన సభలో ఆయన మాట్లాడారు. 'మోదీ మూడోసారి ప్రధాని కావాలి. 12 స్థానాల్లో అభ్యర్థులను గెలిపించాలి' అని కోరారు. అధికారంలోకి రాగానే తెలంగాణలో అవినీతి లేకుండా  చేస్తామని ప్రకటించారు. పదేళ్లలో దేశంలోని ఎన్నో సమస్యలు పరిష్కరించామని తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు చేసినట్లు గుర్తుచేశారు.

Also Read: BRS Party: ఎన్నికలపై కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. గెలవబోయే స్థానాలు ఎన్ని అంటే?

కాంగ్రెస్ , బీఆర్‌ఎస్‌ రెండు పార్టీలు ఏఐఎంఐఎం పార్టీకి భయపడతాయని అమిత్‌ షా ఆరోపించారు. ఈ రెండు పార్టీల నుంచి మోదీ ముక్తి కలిగిస్తారని చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలంటే కాంగ్రెస్ బీఆర్‌ఎస్ మజ్లిస్ పార్టీకి భయపడతాయని తెలిపారు. ఇక్కడి పాలకులు తెలంగాణను ఢిల్లీకి ఏటీఎమ్‌లా మార్చారని ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. వాటి స్థానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు తీసుకొస్తామని వివరించారు. తెలంగాణ అభివృద్ధి తమ పార్టీతోనే సాధ్యమని తెలిపారు.

'రేవంత్ రెడ్డి నయవంచన బోర్డ్ పెట్టుకొని కూర్చున్నాడు. నయవంచనకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని చేయలేదు. దేశంలో పేద ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ' అని పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు విమర్శించారు. 'అధికారం పోయిందని మాజీ మంత్రి హరీశ్‌ రావు సరిగ్గా సిద్దిపేటకు రావడం లేదు వచ్చిన సాటుగా వచ్చి సాటుగా వచ్చి వెళ్తున్నాడు' అని ఆరోపించారు. భునిర్వాసితులు, రైతులను కేసీఆర్ మాదిరిగా ఎవరూ ఇబ్బందికి గురి చేయలేదని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News