Vijay Sethupathi about Telugu Heroes: కోలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. తెలుగులో ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి..తండ్రి పాత్రలో.. ముఖ్య విలన్ గా కనిపించారు విజయ్ సేతుపతి. తమిళ్లో వరుసగా సినిమాలు చేస్తున్న..విజయ్ సేతుపతి తెలుగులో మాత్రం పెద్దగా కనిపించడం లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తాజాగా విజయ్ సేతుపతికి ఒక డైరెక్టర్.. తమ సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్ గా ఎంపిక చేసుకుందామని..అనగా విజయ్ సేతుపతి వద్దు అని చెప్పారట. ఉప్పెన సినిమాలో తన కూతురి పాత్రలో కనిపించిన.. కృతి శెట్టితో ఇప్పుడు రొమాన్స్ చేయలేక.. విజయ్ సేతుపతి ఆమెను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. 


అయితే ఎన్టీఆర్, ఎఎన్నార్ వంటి హీరోలు ఒక సినిమాలో హీరోయిన్ల కి తండ్రి పాత్రలలో కనిపించి మళ్లీ వేరే సినిమాలో వారితోనే రొమాన్స్ చేశారని, గతంలో వారి సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారిని మళ్లీ హీరోయిన్లుగా కూడా ఎంపిక చేసుకున్నారు అని మరి మీరు ఎందుకు ఒప్పుకోలేదు అన్న ప్రశ్న విజయ్ సేతుపతికి ఎదురైంది. 


"ఉప్పెన సినిమా షూటింగ్ సమయంలోనే..నేను కృతితో నన్ను తన సొంత తండ్రి లాగా ఫీల్ అవ్వమని.. చెప్పాను. మళ్లీ తను హీరోయిన్ గా.. నేను సినిమా చేసే ప్రశ్న లేదు. మిగతా హీరోలు అలా చేసి ఉండొచ్చు, కథ డిమాండ్ చేయడం వల్ల.. అలా నటించి ఉండొచ్చు. కానీ అలా కంపేర్ చేయకూడదు" అంటూ విజయ్ సేతుపతి వల్ల నోళ్ళు మూయించారు. 


ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా.. విజయ్ సేతుపతి తన అభిప్రాయాన్ని బయటపెట్టిన.. విధానాన్ని అభిమానులు కూడా ప్రశంసిస్తున్నారు. ఇక సినిమాల పరంగా చూస్తే విజయ్ సేతుపతి.. చేతినిండా తమిళ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు మహారాజా.. అనే సినిమాలో నటిస్తున్న విజయ్ సేతుపతి.. గాంధీ టాక్స్ అనే ఒక సైలెంట్ ఫిలిం లో కూడా నటిస్తున్నారు.


మరోవైపు కృతి శెట్టి వరుస డిజాస్టర్ లతో సతమతమవుతోంది. ఈ మధ్యనే శర్వానంద్… హీరోగా నటించిన మనమే సినిమాలో.. కనిపించిన కృతి శెట్టికి.. ఈ సినిమాతో పరవాలేదు అనిపించింది. అయితే ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు సినిమాలు లేకపోవచ్చు కానీ.. ఒక మలయాళం సినిమా, మూడు తమిళ సినిమాలతో బిజీగానే ఉంది.


Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..


Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter