Racharikam Movie Poster: విజయ్ శంకర్, అప్సరా రాణి జంటగా.. సురేష్ లంకలపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ  రాచరికం. చిల్ బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఈశ్వర్ ఈ మూవీని నిర్మించారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. హీరోయిన్ అప్సరా రాణి బర్త్‌ డే (జనవరి 12) సందర్భంగా రాచరికం మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పోస్టర్ చూస్తుంటే అప్పరా రాణికి అద్భుతమైన క్యారెక్టర్ లభించినట్లుగా తెలుస్తోంది. కాళీ మాత ఉగ్ర రూపం దాల్చితే.. రక్తంతో ఒళ్లంతా తడిసి ముద్దైతే ఎలా ఉంటుందో.. ఈ పోస్టర్‌లో హీరోయిన్ అలా ఉంది. ఫస్ట్‌ పోస్టర్‌తో మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది చిత్ర బృందం. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్‌తో వస్తామని చెబుతోంది. విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, మహబూబ్ బాష, రూపేష్ మర్రాపు, ప్రాచీ థాకర్, లత, ఈశ్వర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వెంగి మ్యూజిక్ అందించగా.. ఆర్య సాయి కృష్ణ కెమెరామెన్‌గా వర్క్ చేశారు. ఎడిటింగ్ బాధ్యతలను జేపీ నిర్వర్తిస్తున్నారు. 


పూర్తి వివరాలు ఇలా..


==> యాక్టర్స్: విజయ్ శంకర్, అప్సరా రాణి,  విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు


సాంకేతిక బృందం
==> బ్యానర్: చిల్ బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
==> ప్రొడ్యూసర్: ఈశ్వర్ 
==> ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చాణక్య
==> కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: సురేష్ లంకలపల్లి 
==> కెమెరామెన్: ఆర్య సాయి కృష్ణ
==> మ్యూజిక్: వెంగి 
==> ఎడిటర్: జేపీ
==> PRO: సాయి సతీష్    


Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు


Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook