Thangalaan Day 1 Collections: స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15న బోలెడు సినిమాలు విడుదలైన..సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్, రామ్ పోతినేని హీరోగా నటించిన డబల్ ఇస్మార్ట్ ..సినిమాలతో పాటు చియాన్ విక్రమ్..హీరోగా నటించిన తంగలాన్ కూడా భారీ స్థాయిలో విడుదల అయ్యాయి. అన్ని సినిమాల మీద మంచి అంచనాలు ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా తమిళ్లో తంగలాన్.. సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కోసం విక్రమ్ చాలా కష్టపడ్డారు అని.. సినిమా పోస్టర్లు చూస్తేనే తెలుస్తుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన..ఈ సినిమాకి అదే స్థాయిలో కలెక్షన్లు కూడా లభిస్తున్నాయి. ఎపిక్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద.. మంచి వసూళ్లను అందుకుంటోంది. 


మొదటి రోజున ఈ సినిమాకి.. ప్రపంచవ్యాప్తంగా 12.6 కోట్ల కలెక్షన్లు నమోదు అయ్యాయి. ప్రధాన వసూళ్లలో తమిళ్ వర్షన్ 11 కోట్లు వసూలు చేయగా.. తెలుగు వర్షన్ 1.5 కోట్లు సంపాదించాయి. అంతేకాకుండా మొదటి రోజే 71.64 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ తో.. ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది.


అయితే మణిరత్నం దర్శకత్వంలో విడుదలైన పొన్నియన్ సెల్వన్: II సినిమాతో పోలిస్తే ఇది తక్కువ అని చెప్పుకోవాలి. కానీ లాంగ్ వీకెండ్ రావడంతో.. సినిమా టాక్ కూడా బాగా ఉండటంతో.. కలెక్షన్లు బాగానే నమోదు అవుతాయి అని చెప్పుకోవచ్చు. లాంగ్ వీకెండ్ ఈ సినిమా కలెక్షన్లకి బాగా సహాయపడుతుంది అని ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు.


పర్వతి తిరువోత్తు, మాళవిక మోహనన్, పసుపతి, డేనియెల్ కల్టాజిరోన్, హరి కృష్ణన్ అంబుదురై, సంపత్ రామ్ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలలో నటించారు. ఈ చిత్రం 1850 సీ.ఈ. నాటి నార్త్ ఆర్కాట్‌లోని వెప్పూర్ గ్రామం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.


Also Read: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..


Also Read: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter