Kamal Haasan, Vijay Sethupathi and Suriya starrer Vikram Movie Twitter Review: డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'విక్రమ్‌'. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి, మలయాళ స్టార్ ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషించారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి కమల్‌ హాసన్‌ ఈ సినిమాని నిర్మించారు. కమల్‌ నుంచి సినిమా వచ్చి నాలుగేళ్లయిన నేపథ్యంలో విక్రమ్‌ సినిమా కోసం ఫాన్స్ అందరూ వేయి కళ్ళతో ఎదురుచూశారు. ఎట్టకేలకు జూన్‌ 3న విక్రమ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'విక్రమ్‌: హిట్‌ లిస్ట్‌' పేరుతో సుధాకర్‌ రెడ్డి, హీరో నితిన్‌ తెలుగులో విడుదల చేశారు. తెలుగు, తమిళ్, హిందీలో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన విక్రమ్‌ సినిమాను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు. హై ఓల్టేజ్‌ యాక్షన్ మూవీ అని ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. కమల్‌ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్, సూర్య నటన హైలెట్ అని.. అనిరుధ్‌ రవిచందర్‌ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరో ప్లస్ పాయింట్ అని అంటున్నారు.


'విక్రమ్‌ సినిమా సూపర్బ్.. విక్రమ్‌ 2 చూసేందుకు ఎంతో ఎదురుచూస్తున్నాం' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'డైరెక్టర్ సూపర్‌ ట్రీట్‌ ఇచ్చాడు'  ఇంకొకరు ట్వీట్ చేశారు. 'డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ నుంచి ఏమైతే కోరుకున్నామో అంతకుమించి ఈ సినిమాలో ఇచ్చాడు. అన్నిటికి మించి సూర్య ప్రసెన్స్‌ బాగుంది. ఖైదీ 2 లేదా విక్రమ్‌ 2 చూసేందుకు ఎంతో ఎదురుచూస్తున్నాం', 'సూర్య గెటప్‌, ఎలివేషన్‌ సూపర్బ్. అతని కెరీర్‌లోనే ఇది బెస్ట్‌ సీన్‌', 'ఈ మధ్య కాలంలో నేను చూసిన మంచి సినిమా ఇది. రీడు భాగంలో వచ్చే యాక్షన్‌ సీన్లు అభిమానులను మరోసారి థియేటర్ కు రప్పిస్తాయి'అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 



ఖైదీ, మాస్టర్‌ సినిమాల డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజు దర్శకత్వం అందరిని ఆకట్టుకుంది. ముగ్గురు స్టార్ హీరోల నటన ప్రేక్షకులను అలరిస్తోంది. అభిమానుల ట్వీట్స్ చూస్తే.. విక్రమ్‌ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని అర్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో కాళిదాస్ జయరామ్, నరేన్, అర్జున్ దాస్ మరియు శివాని నారాయణన్ కీలక పాత్రల్లో నటించారు.






Also Read: Major Twitter Review: రేటింగ్, గీటింగ్ జాన్తా నయ్.. 'మేజర్' సినిమా చూడాల్సిందే!


Also Read: Friday Mantra: శుక్రవారం నాడు ఈ సూక్తం చదివితే.. అపారమైన సంపద, ఆనందం మీ సొంతమవుతుంది!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook