Major Twitter Review: రేటింగ్, గీటింగ్ జాన్తా నయ్.. 'మేజర్' సినిమా చూడాల్సిందే!

Adivi Sesh's Major Movie Twitter Review. మేజర్‌ సినిమా ప్రీమియ‌ర్ షో చుసిన ప్రేక్షకులు ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. కొందరు అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ బయటికి వస్తున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 3, 2022, 08:22 AM IST
  • జూన్‌ 3న పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్
  • రేటింగ్, గీటింగ్ జాన్తా నయ్
  • 'మేజర్' సినిమా చూడాల్సిందే
Major Twitter Review: రేటింగ్, గీటింగ్ జాన్తా నయ్.. 'మేజర్' సినిమా చూడాల్సిందే!

Adivi Sesh starrer Major Movie Twitter Review: శశి కిరణ్‌ తిక్కా దర్శకత్వంలో టాలీవుడ్ యువ హీరో అడివి శేష్‌ నటించిన చిత్రం 'మేజర్‌'. ఈ సినిమాను జీఎంబీ ఎంట‌ర్టైన‌మెంట్స్‌, సోనీ పిక్చ‌ర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ+ఏయ‌స్ మూవీస్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అడివి శేష్‌కు జోడీగా సాయి మంజ్రేక‌ర్ నటించగా.. శోభితా ధూళిపాల కీల‌క‌ పాత్ర‌లో న‌టించారు. మేజర్‌ సినిమా 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా తెరకెక్కింది. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా నేడు (జూన్‌ 3న) పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది.

మేజర్‌ చిత్రం నుంచి ఇదివరకే విడుద‌లైన ప్రచార చిత్రాలు, టీజ‌ర్ గ్లింప్స్, ట్రైల‌ర్‌ ప్రేక్ష‌కుల‌లో భారీ స్థాయిలో అంచనాలను పెంచాయి. ఇటీవ‌లే దేశంలోని కొన్ని ప్రధాన న‌గ‌రాల్లో మేజ‌ర్ చిత్రం ప్రీమియ‌ర్ షోలు వేయ‌గా.. వాటికి ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పంద‌న వ‌చ్చింది. ఇక నేడు పాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ అయింది. చాలా ప్రాంతాల్లో మేజర్‌ ప్రీమియ‌ర్ షోలు పూర్తయ్యాయి. సినిమాను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

మేజర్‌ సినిమా ప్రీమియ‌ర్ షో చుసిన ప్రేక్షకులు ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. కొందరు అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ బయటికి వస్తున్నారు. 'మేజర్‌ సినిమాకు రేటింగ్ ఇవ్వలేం.. సినిమా చూడాల్సిందే' అని ఒకరు కామెంట్ చేయగా.. 'మేజర్ అంటే సినిమా కాదు.. ఓ ఎమోషన్' అని మరొకరు ట్వీట్ చేశారు. 'క్లైమాక్స్ చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు కంట కన్నీరు వస్తుంది', 'అడివి శేష్ అద్భుతంగా నటించాడు', 'డైరెక్టర్ శశికిరణ్ తిక్క దర్శకత్వం సూపర్', 'బాక్సాఫీస్ విన్నర్', 'అడివి శేష్ దేశాన్ని గర్వపడేలా చేశాడు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: AP 10th Results: రేపే పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.. నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుశిక్ష తప్పదు!  

Also Read: Horoscope Today June 3 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి అక‌స్మిక ధ‌న‌ లాభం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News