Vikramarkudu Movie Child Artist Neha Thota Then and Now: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. కానీ కొంతమంది మాత్రమే తమ నటనతో మెప్పించి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించి తరువాత హీరోలు, హీరోయిన్లుగా మారిన వారు ఎందరో ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు మనం మాట్లాడబోయేది కూడా తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించిన నేహా తోట గురించి. రవితేజ నటించిన విక్రమార్కుడు చిత్రంలో తన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నేహా తోట ఆ సినిమాలో తన నటనకు గాను మంచి ప్రశంసలు అందుకుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో జన్మించిన నేహా తోట అనసూయ, రాముడు, ఆది విష్ణు, ఆర్జీవీ రక్ష, సర్కార్ చిత్రాల్లో నటించారు. ఇక చిన్నప్పుడే హైదరాబాద్ వచ్చేసి ఆమె కుటుంబం సెటిల్ ఐయ్యింది.


ఇది కూడా చదవండి: Rajamouli TIMEs: మోడీ, జగన్, కేసీఆర్ కంటే జక్కన్న పవర్ ఫుల్లా.. క్రేజ్ అమ్మా మొగుడయ్యాడుగా!


అయితే ఆమె దాదాపుగా పదేళ్ల పై నుంచే పెద్దగా తెరపై కనిపించడం లేదు. ఇక అందుతున్న సమాచారం మేరకు నేహా సినిమాల కంటే తన చదువుపైనే ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. నిజానికి చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలి అనుకున్నా ఆమె బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పూర్తి చేస్తోందట. ఇక చిన్నప్పుడు చాలా క్యూట్ గా కనిపించిన ఆమె ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నేహా చాలా కాలంగా తన ఫోటోలను షేర్ చేస్తూనే వస్తోంది.      [[{"fid":"269423","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఆమె అందం చూసి కొందరు ఆమె త్వరలో హీరోయిన్‌గా కనిపిస్తోందని, సినిమాల నుంచి ఆమె ఎందుకు తప్పుకున్నారని కూడా నెటిజన్లు కామెంట్లు చేయడంతో చదువు పూర్తయ్యాక సినిమా అవకాశాలు రాగానే నటిస్తానని ఆమె చెబుతోంది. ఇక ఆమె తల్లి కృష్ణా జిల్లా చల్లపల్లి ప్రాంతానికి చెందిన మహిళ కాగా తండ్రి గుడ్లవల్లేరు ప్రాంతానికి చెందిన వారు. మరి ఆమె అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? అని మీకు అనిపిస్తుందో కామెంట్ చేసేయండి.
ఇది కూడా చదవండి: SS Rajamouli Love Story: రమతో రాజమౌళి ప్రేమ..రెండో పెళ్లి.. అందుకే పిల్లలు కూడా వద్దనుకున్నారట!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook