SS Rajamouli Love Story: రమతో రాజమౌళి ప్రేమ..రెండో పెళ్లి.. అందుకే పిల్లలు కూడా వద్దనుకున్నారట!

SS Rajamouli - Rama Rajamouli Love: చాలా మంది రాజమౌళి- రమ ప్రేమించి వివాహం చేసుకున్నారని తెలుసు కానీ వారి పూర్తి లవ్ స్టోరీ ఎవరికీ పెద్దగా తెలియదు.. ఈ క్రమంలో వారి లవ్ స్టోరీ మీకోసం 

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 14, 2023, 03:34 PM IST
  • టాప్ 100 వరల్డ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ జాబితాలో రాజమౌళి
  • సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న జక్కన్న
  • రమా రాజమౌళి లవ్ స్టోరీ మీకోసం
SS Rajamouli Love Story: రమతో రాజమౌళి ప్రేమ..రెండో పెళ్లి.. అందుకే పిల్లలు కూడా వద్దనుకున్నారట!

SS Rajamouli - Rama Rajamouli Love Story in Telugu: టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి టాప్ 100 వరల్డ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ జాబితాలో చోటు దక్కించుకోవడంతో ఆయన ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చారు. ఆయన గురించి అనేక విషయాలు తెరమీదకు వస్తున్నాయి. ముఖ్యంగా రాజమౌళి ఆయన భార్య రమా రాజమౌళి గురించిన లవ్ స్టోరీ గురించి చాలా మందికి తెలియదు. ప్రస్తుతానికి రాజమౌళి భార్య రమా రాజమౌళి, రాజమౌళి చేస్తున్న సినిమాల్లోనే కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూ ఉంటారు.

రాజమౌళి కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన చేస్తున్న దాదాపు అన్ని సినిమాలకు రమా రాజమౌళి స్వయంగా కాస్ట్యూమ్ డిజైన్ చేస్తూ ఉండడం గమనార్హం. నిజానికి వీరిద్దరిని ఇండస్ట్రీలో చాలామంది ఆదర్శ దంపతులుగా భావిస్తూ వారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతూ ఉంటారు. వాస్తవానికి రాజమౌళి, రమా రాజమౌళి ఇద్దరిదీ ప్రేమా వివాహం.

అయితే వీరి ప్రేమ ఎలా మొదలైంది? ఆ ప్రేమ పెళ్లి వరకు ఎలా వెళ్ళింది? అనే విషయాలు చాలామందికి తెలియదు. కానీ సినీ రంగంలో ఉన్న అతి కొద్ది మందికి మాత్రమే ఈ విషయాలు తెలుసు. నిజానికి రాజమౌళిని వివాహం చేసుకోవడం కంటే ముందే రమకు వేరే వ్యక్తితో వివాహం జరిగింది. వారి దాంపత్యానికి గుర్తుగా కార్తికేయ కూడా జన్మించాడు. అయితే తర్వాత అభిప్రాయ భేదాలు రావడంతో రమ తన కుమారుడితో విడిగా జీవించడం మొదలు పెట్టింది.

ఇదీ చదవండి: Shaakuntalam Review: సమంత శాకుంతలం రివ్యూ.. విజువల్ ట్రీటే కానీ?

కీరవాణి రాజమౌళి ఇద్దరూ అన్నదమ్ముల కుమారులు, కీరవాణిని రాజమౌళి చాలా గౌరవిస్తూ ఇప్పటికీ తన ప్రతి సినిమాలో ఆయననే మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకుంటూ ఉంటారు. ఈ రమ కీరవాణి భార్య వల్లి సోదరి. దగ్గర బంధుత్వం ఉండడంతో రాజమౌళి, రమా ఇద్దరికీ సాధారణ పరిచయం ఏర్పడింది. రాజమౌళి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు శిష్యుడుగా ఉంటూ శాంతినివాసం సీరియల్ దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్నాడు.

ఆ సమయంలోనే వీరిద్దరికి పరిచయం ఏర్పడి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా డైరెక్ట్ చేసే టైంకి ప్రేమ కూడా చిగురించింది. ఆమెకు అప్పటికే వివాహం అయ్యి ఒక కుమారుడు కూడా ఉన్నాడనే విషయం తెలిసిన రాజమౌళి ఆమెను వివాహం చేసుకునేందుకు నిర్ణయం తీసుకుని ఇంట్లో పెద్దలందరినీ ఒప్పించారు. అయితే సినీ కుటుంబం కావడంతో హడావుడిగా పెళ్లి చేసుకోకుండా చాలా సాదాసీదాగా వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత కూడా కార్తికేయను తన సొంత కుమారుడు కంటే ఎక్కువగా రాజమౌళి చూసుకుంటూ వచ్చారు. ఒకవేళ తమకు సంతానం కలిగితే కార్తికేయను సరిగా చూసుకో మేమో అనే ఉద్దేశంతో రాజమౌళి రమతో సంతానాన్ని కూడా కోరుకోలేదని చెబుతూ ఉంటారు.

అయితే రాజమౌళి ఒకానొక సందర్భంలో ఒక ఆడపిల్లను దత్తత తీసుకుని ఆమెను పెంచుతూ వస్తున్నారు. ఇక రాజమౌళి పనిచేస్తున్న దాదాపు అన్ని సినిమాలకు కుటుంబం అంతా కలిసి పనిచేస్తూ ఉంటుంది. రాజమౌళి సోదరుడు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తే ఆయన భార్య వల్లి ఆ సినిమాకి లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇక రాజమౌళి భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తే వీరి కుమారుడు కార్తికేయ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఖర్చు పెరగకుండా తక్కువ ఖర్చులోనే క్వాలిటీ సినిమా ఎలా ఇవ్వాలనే బాధ్యతలు తీసుకుంటూ ఉంటాడు.

ఇదీ చదవండి: Chiranjeevi's Toyota Vellfire: చిరంజీవి కొత్త కారు ఫీచర్స్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే.. లగ్జరీ కార్ల కింగ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News