Vintage Mahesh Babu in SSMB 28: సూపర్ స్టార్ మహేష్ బాబు చివరిగా సర్కారు వారి పాట అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పరశురామ్ దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది మే నెలలో విడుదలైంది. కానీ ఆ తర్వాత ఆయన తరువాతి సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ బయటికి రావడం లేదు. మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద చినబాబు, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిజానికి ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత మహేష్ బాబు తల్లి ఆ తర్వాత మహేష్ బాబు తండ్రి మరణించడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతానికైతే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్నట్లుగా చెబుతున్నారు.


ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ అయితే బయటకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమా మొదటి భాగం లో మహేష్ బాబు సిగరెట్ తాగే సీన్లు కొన్ని ఉన్నాయి అని అంటున్నారు. సాధారణంగా మహేష్ బాబు ఇలాంటి విషయాలకు చాలా దూరంగా ఉంటాడు. కానీ సినిమాలో సీన్ డిమాండ్ చేయడంతో ఆయన సిగరెట్ తాగాడని పోకిరి సహా అతడు లో ఉన్న కొన్ని వింటేజ్ వైబ్స్ మళ్లీ రీ క్రియేట్ చేయడానికి త్రివిక్రమ్ ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది.


ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా ఇలాగే వింటేజ్ వైబ్స్ వల్ల సూపర్ హిట్ టాక్ దక్కించుకోవడమే కాక రిపీట్ ఆడియన్స్ ని కూడా థియేటర్లకు రప్పిస్తున్న నేపథ్యంలో త్రివిక్రమ్ ఇలా వింటేజ్ లుక్స్ తో మహేష్ బాబుని చూపించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.


వాస్తవానికి త్రివిక్రమ్ హారిక హాసిని క్రియేషన్స్ లేదా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల నుంచి బయటకు వెళ్లి సినిమాలు చేయరు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించే సినిమాల్లో ఆయనకు కూడా రెమ్యూనరేషన్ కాకుండా లాభాల్లో కూడా వాటా ఉంటుందని ప్రచారం ఉంది. ఈ నేపద్యంలోనే మహేష్ బాబు సినిమా నుంచి గట్టిగా వసూళ్లు రాబట్టాలని చూస్తున్న త్రివిక్రమ్ ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేశారని టాలీవుడ్ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది.
Also Read: Prabhas Movies : ఆరు నెలల్లో మూడు ప్రభాస్ సినిమాలు.. ఇక ఫాన్స్ కి పండగే!


Also Read: Rashmika Mandanna Emotional: మగాడిలా ఉన్నావంటూ ట్రోల్స్.. రష్మిక ఏమందో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook