Rashmika Mandanna on Defaming her Gender: కన్నడ భామ రష్మిక మందన కిరిక్ పార్టీ అనే సినిమాతో హీరోయిన్ గా మారింది. తర్వాత చలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన అతి కొద్ది సమయంలోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది. చేస్తున్న అన్ని సినిమాలు హిట్లు అవుతూ రావడంతో ఆమెకు గోల్డెన్ లెగ్ అని పేరు పడిపోయింది. ఈ క్రమంలో రష్మిక మందన చేస్తున్న కొన్ని సినిమాలు బోల్తా పడుతున్నా ఆమె హిట్ల లెక్కలోకి వేసుకుంటూ నిర్మాతలు ఆమెకు బంగారు అవకాశాలు ఇస్తూ వెళుతున్నారు.
అయితే ప్రస్తుతానికి టాలీవుడ్ ని కూడా దాటుకుని బాలీవుడ్ కి వెళ్లి సెటిల్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న రష్మిక మందన అనేక సందర్భాలలో తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి బదులు నెగిటివ్ కామెంట్లు చేస్తూ ట్రోలర్లకు టార్గెట్ గా మారుతుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం మీద మాట్లాడిన రష్మిక మందన ఈ ట్విట్టర్లో ట్రోల్స్ అలాగే తనను టార్గెట్ చేస్తూ తన క్యారెక్టర్ ని టార్గెట్ చేస్తూ తన స్త్రీత్వాన్ని కూడా టార్గెట్ చేస్తూ ఆమె అబ్బాయిలా కనిపిస్తోంది అంటూ జరుగుతున్న ట్రోలింగ్ మీద ఆమె స్పందించింది.
ఈ విషయం మీద ఆమె స్పందిస్తూ కొన్నిసార్లు తాను కూడా తనని తాను ప్రశ్నించుకుంటూ ఉంటానని, నేను సినిమాలు నిలిపేయాలా? అని అప్పుడప్పుడు అనిపిస్తుందని కూడా ఆమె కామెంట్ చేసింది. ఇక రష్మిక మందన ప్రస్తుతానికి వరుస సినిమాలు వెళుతోంది. కేవలం తెలుగు మాత్రమే కాదు తమిళ, హిందీ భాషల్లో కూడా వరుస సినిమాల్లో భాగమవుతోంది.
గతంలో రక్షిత్ శెట్టి అనే కన్నడ హీరోతో ఎంగేజ్మెంట్ చేసుకొని తరువాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న ఈ భామ ప్రస్తుతానికి విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక వీరిద్దరి మధ్య నిజంగానే ఏదో ఉందని అనుమానం వచ్చే విధంగా అనేకసార్లు సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నా వీరిద్దరూ అడపా దడపా ఖండిస్తూ వస్తున్నారు. కానీ వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే ప్రచారం మాత్రం ఊపందుకుంటూనే ఉంది. మరి రష్మిక ఆవేదన మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.
Also Read: Prabhas No.1: 2022 టాప్ హీరోగా ప్రభాస్.. టాప్ టెన్ లిస్టులో ఉన్న హీరోలు ఎవరంటే?
Also Read: Love Today Scene: తమిళనాడులో ఫోన్లు మార్చుకున్న లవ్ కపుల్.. 'ఆ' వీడియోలు బయటపడడంతో మొదటికే మోసం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook