Virupaksha Collections: సాయి ధరమ్ తేజ్ మాస్.. మొదటి రోజును మించిన రెండో రోజు వసూళ్లు!
Virupaksha Day 2 Collections: సాయి ధరంతేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం విరుపాక్ష మొదటి రోజు వసూళ్ల కంటే రెండో రోజు వసూళ్లు ఎక్కువగా నమోదయ్యాయి.
Virupaksha 2 Days Total Collections: సాయి ధరంతేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం విరుపాక్ష. సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దండు డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ మీద భోగవల్లి ప్రసాద్ నిర్మించగా ఆయన కుమారుడు భోగవల్లి బాపినీడు సమర్పించారు. చేతబడుల నేపథ్యంలో సాగిన ఈ సినిమా ఒక హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ దక్కించుకోవడంతో మొదటి రోజు వసూళ్లు ఎక్కువగా నమోదయ్యాయి.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మొదటి రోజు వసూళ్ల కంటే రెండవ రోజు వసూళ్లు ఇంకా పెరిగాయి. తాజాగా ఈ సినిమా మొదటి రెండు రోజుల వసూళ్ల విషయానికి వస్తే మొదటి రోజు నాలుగు కోట్ల 79 లక్షల తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన విరూపాక్ష సినిమా రెండో రోజు ఐదు కోట్ల 20 లక్షలు అంటే దాదాపు కోటి రూపాయలు ఎక్కువ వసూలు చేసింది. ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులకు గాను 10 కోట్ల 59 లక్షల షేర్ 18 కోట్ల 20 లక్షల గ్రాస్ వసూలు చేసింది.
Also Read: Pawan Fan Murderd: పవన్ కల్యాణ్ అభిమానిని కొట్టి చంపిన ప్రభాస్ ఫ్యాన్..ఇదేం శాడిజం అయ్యా?
ఇక రెండో రోజు ఏరియాల వారీగా ఎంత వసూళ్లు నమోదయ్యాయి అనే విషయానికి వస్తే నైజాం ప్రాంతంలో రెండు కోట్ల 71 లక్షలు, సీడెడ్ ప్రాంతంలో 89 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 75 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 35 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 19 లక్షలు, గుంటూరు జిల్లాలో 35 లక్షలు, కృష్ణా జిల్లాలో 38 లక్షలు, నెల్లూరు జిల్లాలో 18 లక్షలు ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో రెండవ రోజు ఐదు కోట్ల 20 లక్షల షేర్ రాబట్టిన ఈ సినిమా 9 కోట్ల 60 లక్షల గ్రాస్ వసూలు చేసింది.
ఇక ఈ సినిమా కర్ణాటక సహా మిగతా భారత దేశంలో 85 లక్షలు వసూలు చేయగా ఓవర్సీస్ లో రెండు కోట్ల 21 లక్షలు వసూలు చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఓవర్సీస్ లో రెండు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ చేసేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా రెండు రోజులకు గాను 13 కోట్ల 65 లక్షల షేర్ వసూలు చేసిన ఈ సినిమా 24 కోట్ల 60 లక్షల గ్రాస్ వసూలు చేసినట్లయింది. ఇక ఈ సినిమా మొత్తం బిజినెస్ 22 కోట్ల 20 లక్షలకు జరగడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 23 కోట్లుగా నిర్ణయించారు.
ఇంకా తొమ్మిది కోట్ల 35 లక్షలు వసూలు చేస్తే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్ సారిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాతో పోటీ పడటానికి పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడం మరో వారం రోజులు పాటు ఈ సినిమాకి డోకా లేదని చెప్పాలి. ఇక ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సినిమా హిట్ స్టేటస్ సాధించడం ఖాయం అని అంటున్నారు. అదే విధంగా సాయిధరమ్ తేజ్ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టే సినిమాగా కూడా నిలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనేది.
Also Read: Crow Sentiment: బలగం-విరూపాక్ష సినిమాలల్లో ఈ కామన్ పాయింట్ చూశారా? డబ్బే డబ్బు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook