Virupaksha Promotions: చూశాక మళ్లీ పోయడానికి ఇక్కడికే వస్తారు.. టాయిలెట్స్ లో `విరూపాక్ష` అరాచకం ప్రమోషన్స్ చూశారా?
Virupaksha Team promotions: విరూపాక్ష అనే సినిమాతో మంచి హిట్ అందుకున్న సాయి ధరంతేజ్ మంచి జోష్ లో ఉన్నాడు, అయితే ఈ సినిమాను ఆసక్తికరంగా ప్రమోట్ చేస్తోంది సినిమా యూనిట్.
Virupaksha Team promotes spooky experience of the film using toilet posters: ఎట్టకేలకు సాయి ధరంతేజ్ విరూపాక్ష అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. సుకుమార్ శిష్యుడు సాయి కార్తీక్ వర్మ దండు డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా అద్భుతమైన టాక్ దక్కించుకుంటుంది. సినిమా అద్భుతంగా ఉందని చూసిన వారందరూ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.
హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా చేతబడి నేపథ్యంలో సాగుతుంది. ఇక ఈ సినిమా చూసిన వారందరూ సినిమా బాగుందని కామెంట్లు చేస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాని భోగవల్లి ప్రసాద్ సాయి ధరంతేజ్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక ఈ సినిమాని వినూత్నంగా ప్రమోట్ చేస్తున్న సినిమా యూనిట్ తాజాగా పివిఆర్ థియేటర్స్ లోని వాష్ రూమ్స్ లో కొన్ని ఆసక్తికరమైన పోస్టర్లను ప్రచురించింది. ముఖ్యంగా మీరు కాసేపటికి మళ్ళీ ఇక్కడికే వస్తారు ఎందుకంటే మా సినిమా మిమ్మల్ని అంతగా భయపెడుతుంది.
ఇది మీకు కరెక్ట్ గా డేట్ నైట్ అవుతుంది ఎందుకంటే మా సినిమా చూసిన మీ లవర్ మిమ్మల్ని హగ్ చేసుకుంటుంది, మీరు భయపడే సోమవారం కంటే మా సినిమా మిమ్మల్ని ఎక్కువ భయపెడుతుంది అంటూ ఇలా రకరకాల ఆసక్తికరమైన కొటేషన్లతో యూరిన్ పోసే కమోడ్ ఎదురుగా పోస్టర్లు అతికించారు. అంతేకాదు ఆ పోస్టర్లు అతికించిన ఫోటోలు తీసి కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది.
అయితే ఈ సినిమా ఇంత అద్భుతమైన టాక్ దక్కించుకుని దూసుకుపోతున్న సాయిధరమ్ తేజ్ కెరీర్ లో అత్యధిక ఓపెనింగ్ డే రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ మాత్రం రాబట్ట లేక పోయింది. ఇప్పటివరకు ఆ రికార్డు విన్నర్ సినిమా మీదనే ఉంది. సాయి ధరంతేజ్ హీరోగా శ్రీను వైట్ల డైరెక్షన్లో రూపొందిన విన్నర్ సినిమా కలెక్షన్లు దాదాపు 5 కోట్లకు పైగానే వచ్చాయి. కానీ విరూపాక్ష సినిమా మాత్రం నాలుగు కోట్ల 70 లక్షల వరకు మాత్రమే సాధించగలిగింది. అలా ఈ సినిమా విన్నర్ సినిమా రికార్డును బద్దలు కొట్టలేకపోయింది అన్నమాట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook