Virupaksha Collections: 'విరూపాక్ష'కి ఊహించని షాక్.. సూపర్ హిట్ టాక్ తో కూడా డిజాస్టర్ సినిమా కలెక్షన్స్ దాటలేక పోయిందిగా!

Virupaksha Day 1 Collections: సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాగా  కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా కలెక్షన్లు నమోదయ్యాయి.   

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 22, 2023, 06:09 PM IST
Virupaksha Collections: 'విరూపాక్ష'కి ఊహించని షాక్.. సూపర్ హిట్ టాక్ తో కూడా డిజాస్టర్ సినిమా కలెక్షన్స్ దాటలేక పోయిందిగా!

Virupaksha Movie Day 1 Collections: సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా శుక్రవారం అంటే ఏప్రిల్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్ థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఈ సినిమా మొదటి ఆట నుంచి ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేస్తుంది. దాదాపుగా ఈ సినిమా చూసిన వారంతా సినిమా బాగుందని కామెంట్లు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సాయి ధరంతేజ్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే కలెక్షన్లు బాగానే వచ్చినా సాయి ధరంతేజ్ డిజాస్టర్ సినిమాకి వచ్చిన వసూళ్లను ఈ సినిమా దాట లేకపోయిందని అంటున్నారు. నిజానికి ఈ సినిమా నైజాం ప్రాంతంలో కోటి 82 లక్షలు, సీడెడ్ ప్రాంతంలో 54 లక్షలు, ఉత్తరాంధ్ర 58 లక్షలు, ఈస్ట్ గోదావరి నలభై లక్షలు, వెస్ట్ గోదావరి 47 లక్షలు, గుంటూరు 46 లక్షలు, కృష్ణ 32 లక్షలు, నెల్లూరు 20 లక్షలు కలిపి మొత్తం తెలుగు రాష్ట్రాలలో నాలుగు కోట్ల 79 లక్షలు షేర్, 8 కోట్ల అరవై లక్షల గ్రాస్ వసూలు చేసింది.

Also Read: Samantha Strong Counter: ముసలి ముఖమన్న చిట్టిబాబుకు సమంత స్ట్రాంగ్ కౌంటర్.. అందుకే చెవిలో వెంట్రుకలంటూ?

ఈ సినిమా కర్ణాటక సహా మిగతా భారత దేశంలో 36 లక్షలు వసూలు చేయగా ఓవర్సీస్ లో కోటి 20 లక్షలు వసూలు చేసింది. అలా ప్రపంచవ్యాప్తంగా ఆరు కోట్ల 35 లక్షల షేర్ 11 కోట్ల 85 లక్షల గ్రాస్ వసూలు చేసింది. నిజానికి సాయి ధరంతేజ్ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా ఆయన హీరోగా శ్రీనువైట్ల డైరెక్షన్లో రూపొందిన విన్నర్ అనే సినిమా నిలిచింది. ఈ సినిమాకి అప్పుడున్న క్రేజ్ ప్రకారం ఐదు కోట్ల 65 లక్షలు వసూళ్లు వచ్చాయి.

తర్వాత రోజుల్లో దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది అనుకోండి అది వేరే విషయం. ఇక విరూపాక్ష నాలుగు కోట్ల 79 లక్షలు వసూలు చేయగా తర్వాత స్థానంలో నాలుగు కోట్ల ఐదు లక్షల రూపాయలతో సుప్రీం సినిమా మూడవ స్థానంలో నిలిచింది. తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, చిత్రలహరి సినిమాలు కూడా ఉన్నాయి.  అయితే దారుణమైన విషయం ఏమిటంటే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న విన్నర్ సినిమా కంటే తక్కువ వసూలు కలెక్ట్ చేయడం. 

Also Read: Virupaksha Team: సినిమా హిట్టైంది అనుకునేలోపే దర్శకనిర్మాతలకు బిగ్ షాక్..థియేటర్కి వెళ్తే దెబ్బేశారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News