Vishal Laththi Telugu Movie Review విశాల్ డిటెక్టివ్, అభిమన్యుడు సినిమాలతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. అయితే అప్పటి నుంచి మళ్లీ ఇంత వరకు మరో హిట్ కొట్టలేకపోయాడు. ఇప్పుడు మళ్లీ లాఠీ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ లాఠీ సినిమా ఎలా ఉంది? కథ, కథనాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కథ
మురళీ కృష్ణ (విశాల్) ఓ హత్యాచారయత్నం కేసు వల్ల సస్పెండ్ అవుతాడు. మళ్లీ ఉద్యోగంలో తిరిగి జాయిన్ అవ్వడానికి ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతాడు. ఈ క్రమంలో డీఐజీ కమల్ (ప్రభు) సాయం చేస్తాడు. డీఐజీ కూతురిని ఊర్లోని రౌడీ సూర కొడుకు వీర ఘోరంగా అవమానిస్తాడు. పోలీసు అయి ఉండి కూడా వీర మీద యాక్షన్ తీసుకోలేకపోతోన్నాని డీఐజీ బాధపడుతుంటాడు. అయితే మురళీ చేత వీరను కొట్టిస్తాడు డీఐజీ. ఆ తరువాత వీర తన ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు? ఆ హత్యాచార కేసును మురళీ పరిష్కరించాడా? వీర నుంచి మురళీ కృష్ణ తనని, తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఏం చేశాడు? చివరకు ఏం జరిగింది? అనేది కథ.


నటీనటులు
కానిస్టేబుల్ మురళీ కృష్ణ పాత్రలో విశాల్ చక్కగా నటించాడు. ఇక ఇందులో ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండటంతో విశాల్ దుమ్ములేపేశాడు. సెకండాఫ్ మొత్తం విశాల్ యాక్షన్ సీక్వెన్స్‌ నడుస్తుంటాయి. ఇక ఇందులో మురళీ కృష్ణ భార్యగా కవిత పాత్రలో హీరోయిన్ సునైన కనిపిస్తుంది. ఆమె పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ కూడా ఉండదు. ఇక డీఐజీ కమల్‌గా ప్రభు కాసేపు కనిపిస్తాడు. వీర, సూరలు కనిపించిన విలన్లు కాస్త కామెడీగా అనిపిస్తారు. అప్పుడప్పుడు క్రూరంగా కనిపిస్తారు. మిగిలిన పాత్రలు పర్వాలేదనిపిస్తాయి.


విశ్లేషణ
లాఠీ సినిమా పాయింట్ ఇది వరకు చూడనిది కాదు. చాలా పాత పాయింటే. అమ్మాయి, అత్యాచార కేసు, పెద్ద విలన్‌ అంటూ ఇలా ఇది వరకు ఎన్నో చూసిన కథలే. అయితే ఇందులో కానిస్టేబుల్ చుట్టూ కథ తిరుగుతుంది. అదే కాస్త కొత్తగా అనిపిస్తుంది. కానీ ఈ కథ, కథనంలో ఎక్కడా కూడా కొత్తదనం కనిపించదు. ప్రథమార్థంలో కొత్త ఆసక్తి కలిగించేలానే స్క్రీన్ ప్లే రాసుకున్నట్టు అనిపిస్తుంది.


హీరోను విలన్ పట్టుకునేందుకు రాసుకున్న ట్రాక్ కాస్త సిల్లీగానే అనిపించినా..ఎంగేజింగ్‌గానే కనిపిస్తుంది. ప్రథమార్థం మొత్తం కూడా ఇదే నడుస్తుంది. ఇక ద్వితీయార్థంలో అయినా కథనం వేగం పుంజుకుంటుంది అనుకుంటే.. ఒకే చోట తిప్పి తిప్పి బోర్ కొట్టించేశాడు. కన్‌స్ట్రక్షన్ జరుగుతున్న భారీ భవనంలో సెకండాఫ్ మొత్తాన్ని షూట్ చేసినట్టు కనిపిస్తోంది.


ఇక సెకండాఫ్‌ మొత్తం కూడా రౌడీ మూకలను హీరో చితకబాదడం లేదంటే.. హీరోను రౌడీలు చితకబాదడం.. మధ్యలో కాస్త రిలీఫ్‌ ఇచ్చేందుకు కొడుకు ఎమోషన్‌ను వాడుకోవం చేశాడు డైరెక్టర్. అది కూడా జనాలకు విరక్తి కలిగిస్తుంది. ఈ టైంలో ఇవేం ఎమోషన్స్, ఇవేం సీన్స్ అంటూ ప్రేక్షకులకు సహన పరీక్ష పెట్టినట్టు అనిపిస్తుంది. హీరో తన కొడుకు కోసం రాజు రాజు అంటూ ప్రాధేయపడే సీన్‌, ఆ తరువాత విలన్‌ను హీరో కొట్టే సీన్‌కు ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూస్తే మనం ఏ కాలంలో ఉన్నాం.. ఏ సినిమాలు చూస్తున్నామనే భావన కలుగుతుంది.


క్లైమాక్స్‌కు వస్తున్న కొద్దీ లాఠీ సినిమా పరమరొటీన్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సాంకేతికంగానూ ఈ సినిమా ఏ మాత్రం మెప్పించదు. సంగీతం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఇలా ఏదీ కూడా జనాలను థియేటర్లకు రప్పించేలా కనిపించడం లేదు.


రేటింగ్ : 2


బాటమ్ లైన్‌.. విశాల్ లాఠీ.. ప్రేక్షకులు చేసుకోవద్దు డబ్బులు లూటీ


Also Read : 2022 Controversial Heroines : కాంట్రవర్సీలో చిక్కకున్న భామలు.. ఏడాది మొత్తంలో వీళ్లే హైలెట్


Also Read : RRR For Oscars : షార్ట్ లిస్ట్‌లో నాటు నాటు.. కీరవాణికి ఆస్కార్ అవార్డు?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook