RRR For Oscars : షార్ట్ లిస్ట్‌లో నాటు నాటు.. కీరవాణికి ఆస్కార్ అవార్డు?

Naatu Naatu Song Shortlisted For 95th Oscar Awards ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుకు షార్ట్ లిస్ట్ అయింది. మరి కీరవాణి అయితే ఆస్కార్‌ అవార్డుకు అడుగు దూరంలో ఉన్నట్టు అనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 22, 2022, 07:41 AM IST
  • ఆస్కార్ షార్ట్ లిస్ట్ మీద చర్చలు
  • బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌లో నాటు నాటు
  • కీరవాణికి ఆస్కార్ దక్కేనా?
RRR For Oscars : షార్ట్ లిస్ట్‌లో నాటు నాటు.. కీరవాణికి ఆస్కార్ అవార్డు?

Naatu Naatu Song Shortlisted For 95th Oscar Awards 95వ ఆస్కార్ అవార్డు మీద ఇండియా చాలా ఆశలు పెట్టేసుకుంది. ఈ సారి రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కచ్చితంగా ఆస్కార్ అవార్డులు తీసుకొస్తుందని ఆశగా చూస్తున్నారు. ఇప్పుడు అకాడమీ అవార్డు సభ్యులు.. షార్ట్ లిస్ట్ అయిన సినిమాల గురించి ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్‌ షార్ట్ లిస్ట్ అయింది. అయితే కీరవాణికి ఆస్కార్ అవార్డు వచ్చేందుకు అడుగు దూరంలోనే ఉందనిపిస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఇప్పటి వరకు నాటు నాటు సాంగ్‌ అయితే షార్ట్ లిస్ట్ అయింది. ఈ పాట ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పదిహేను బెస్ట్ పాటలతో పోటీ పడనుంది. ఈ పదిహేను పాటల్లోంచి ఒక పాటకు మాత్రం ఆస్కార్ అవార్డ్ వస్తుంది. ఈ క్రమంలోనే నాటు నాటు సాంగ్‌కు కచ్చితంగా ఆస్కార్ అవార్డ్ వస్తుందని అంతా భావిస్తున్నారు. ఇండియాకు ఇది ప్రౌడ్ మూమెంట్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇక చెల్లో షో సినిమా అయితే బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో షార్ట్ లిస్ట్ అయింది. ఇక మిగిలిన కేటగిరీల్లో ఎన్నింట్లో ఆర్ఆర్ఆర్ షార్ట్ లిస్ట్ అవుతుందో చూడాలి. ఇప్పటికే రాజమౌళికి ఆస్కార్ అవార్డ్ రావాలని అంతా కోరుకుంటున్నారు. ఇక ఇంటర్నేషనల్ మీడియా సైతం రాజమౌళికి వస్తుందేమో అని అంటున్నారు. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ కూడా రాజమౌళికి బెస్ట్ డైరెక్టర్ అనే అవార్డు ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఇదే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పాకిస్థాన్ నుంచి ఓ పాట కూడా షార్ట్ లిస్ట్ అయింది. అంటే ఆస్కార్ అవార్డుల్లోనూ ఇండియా వర్సెస్ పాకిస్థాన్ అయ్యేట్టుగా ఉంది. ఈ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు ఆస్కార్ అవార్డు గెలవాలని, కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్, పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాళ భైరవలకు గుర్తింపు రావాలని అంతా అనుకుంటున్నారు.

Also Read : Chiranjeevi Vs Nandamuri Balakrishna : రెండో రౌండ్‌లోనూ ఓడిపోయిన బాలయ్య.. మెగాస్టార్ చిరు క్రేజ్ తగ్గేదేలే

Also Read : Mehreen Pirzada : నా కెరీర్‌లో మొదటి సారి ఆ పని చేస్తున్నాను.. ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది.. మెహ్రీన్ కామెంట్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x