Vishal Ratnam: పందెంకోడి, పొగరు వంటి సినిమాలతో తెలుగులో సైతం సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు తమిళ హీరో విశాల్. విశాల్ సినిమాలు అన్నిటికీ అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. విశాల్ అంటే అందరికీ యాక్షన్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. అలాంటి యాక్షన్ డైరెక్టర్ హరితో విశాల్ మూవీ అంటే యాక్షన్ మూవీ లవర్స్‌కు ఇక పండుగే. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం ఈ హీరో రత్నం అని యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాతో తమిళ, తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాని జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి హరి డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో-ప్రోడ్యుసర్. 


తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్టుగా మేకర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమా యోని ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. ఏప్రిల్ 26న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నట్టుగా ఈ సినిమా మేకర్స్ ఈరోజు ప్రకటించారు. సమ్మర్‌లో విశాల్ యాక్షన్ మూవీ థియేటర్లోకి రాబోతోందని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇకపై వరుసగా అప్డేట్లతో రత్నం టీం సందడి చేయనుంది.


మరి ఈ సినిమా కూడా యాక్షన్ హీరో విశాల్ కెరియర్ లో సూపర్ హిట్ అందిస్తుందేమో వేచి చూడాలి.


Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?


Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook