Mark Antony OTT Trending: థియేటర్లలో సంచనాలు సృష్టించిన 'మార్క్ ఆంటోనీ' మూవీ ఓటీటీలో కూడా దుమ్మురేపుతోంది. అక్టోబర్ 13న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన ఈ మూవీకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్క్ ఆంటోనీ.. ఇండియా ట్రెండింగ్‍లో టాప్‍లో ఉంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో విశాల్ సంతోషం వ్యక్తం చేశారు. అమెజాన్ ప్రైమ్‍లో నంబర్ 1 సినిమాగా ట్రెండ్ అవుతున్నందుకు చాలా ఆనందం ఉందని విశాల్ అన్నాడు. ముఖ్యంగా నా ఫేవరెట్ సిల్క్ స్మితను మీ ఇంట్లో నుంచే ఎంజాయ్ చేయండి అని విశాల్ ట్వీట్ చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘మార్క్ ఆంటోనీ’ సెప్టెంబర్ 15వ తేదీన థియేటర్లలో రిలీజైంది. విడుదలైన తొలి రోజు నుంచే ఈ మూవీకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. విశాల్ కెరీర్ లో ఇదే తొలి వంద కోట్లు చిత్రం. ఇందులో హీరో విశాల్, ఎస్‍జే సూర్య నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కామెడీకి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. మినీ స్టూడియో పతాకంపై ఎస్ వినోద్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో విశాల్ డ్యుయల్ రోల్ చేశారు. రీతూ వర్మ, అభినయ, సునీల్, సెల్వరాఘువన్, అభినయ, మహేంద్ర కీ రోల్స్ చేశారు. 



Also Read: Snake Bite: కుక్కలను కాపాడబోయి పాము కాటుకు గురైన 2018 మూవీ రైటర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి