Snake Bite: కుక్కలను కాపాడబోయి పాము కాటుకు గురైన 2018 మూవీ రైటర్

Snake Bite: ప్రముఖ మలయాళ కథారచయిత అఖిల్‌ పి ధర్మాజన్‌ పాముకాటుకు గురయ్యాడు. దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రిలో చేర్చారు. అయితే అతడికి ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 15, 2023, 06:55 PM IST
Snake Bite: కుక్కలను కాపాడబోయి పాము కాటుకు గురైన 2018 మూవీ రైటర్

Akhil P Dharmajan: ప్రముఖ మలయాళ మూవీ రైటర్ ను పాము కాటేసింది. ఈ ఏడాది ఆస్కార్ కు ఎంపికైన 2018 మూవీకి కథా రచయిత (స్ర్కీన్‌ రైటర్‌)గా పనిచేసిన అఖిల్‌ పి ధర్మాజన్‌ పాముకాటుకు గురయ్యాడు. దీంతో అతడు ఆదివారం ఆస్పత్రిలో చేరాడు. కొత్త సినిమా స్క్రిప్ట్ రాసేందుకు కేరళలోని తిరువనంతపురానికి వెళ్లిన ఆయన శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంలో చిక్కుకున్నాడు. అఖిల్ నివాసంలో భారీగా వరదనీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో అతడు వేరే వేరే ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న  క్రమంలో వరద నీటిలో చిక్కుకున్న కొన్ని కుక్కలు అతనికి కనిపించాయి. వాటిని సురక్షిత ప్రాంతానికి తరలించే క్రమంలో అఖిల్ పాముకాటుకు గురయ్యాడు. అయితే అతడికి ప్రాణాపాయం తప్పింది. అయితే కాటువేసిన పాము నాగుపాముగా అఖిల్ గుర్తించాడు.

ప్రస్తుతం అఖిల్‌ తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అబ్జర్వేషన్‌లో ఉంచారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఇవాళ సాయంత్రం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని అఖిల్ మీడియాకు తెలిపాడు. రాష్ట్రవ్యాప్తంగా మరో 5 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. జూడ్ ఆంటోని దర్శకత్వం వహించిన 2018 మలయాళ చిత్రానికి నవలా రచయిత అఖిల్ పి ధర్మజన్ కథా రచయితగా పనిచేశారు. 

Also read: BB 7 Telugu Elimination: హౌస్ నుంచి హాట్ బ్యూటీ ఔట్.. అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అంటున్న నెటిజన్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News