Mark Antony Box Office Collection: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్‌జే సూర్య  లీడ్ రోల్స్ లో నటించిన మూవీ 'మార్క్ ఆంటోనీ'. టైమ్ ట్రావెల్ కాన్సెప్టుకు గ్యాంగ్ స్టర్ డ్రామా జోడించి తెరకెక్కించాడు దర్శకుడు అధిక్ రవిచంద్రన్. ఇందులో రీతూ వర్మ, అభినయ, సునీల్, సెల్వరాఘవన్ కీలక పాత్రలు పోషించారు. విశాల్ డ్యూయల్ పోషించిన ఈ చిత్రం రూ.100 కోట్ల మార్క్ దిశగా సాగిపోతుంది. ఎస్ వినోద్ కుమార్ నిర్మించిన మార్క్ ఆంటోని చిత్రాన్ని రూ. 30 కోట్ల బడ్జెట్‍తో రూపొందించారు. ఈ మూవీ రూ.38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ వరల్డ్ వైడ్‌గా రూ. 40 కోట్లుగా ఫిక్స్ అయింది. ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా  2900 స్క్రీన్లలో విడుదల చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్క్ ఆంటోనీ సెప్టెంబర్ 15న ప్రేక్షకుల మందుకు వచ్చింది. ఈ మూవీ విశాల్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ. 4.17 కోట్ల షేర్, రూ. 8.80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది.  ఈ మూవీ  తమిళనాడులో రూ. 59.60 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.95 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 17. 90 కోట్లతో మొత్తంగా రూ. 96.25 కోట్లు గ్రాస్, రూ. 47.55 కోట్ల షేర్లు కొల్లగొట్టింది. మార్క్ ఆంటోని మూవీ వరల్డ్ వైడ్‌గా రూ. 100 కోట్ల మార్క్ ను అందుకునే అవకాశం ఉంది. విశాల్ కెరీర్‍లోనే తొలిసారి వంద కోట్ల మార్క్ దాటిన సినిమాగా మార్క్ ఆంటోని నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. విశాల్ చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమా ద్వారా హిట్ ట్రాక్ పట్టాడు. 


Also Read: Leo Movie: 'లియో' గురించి రిలీజ్ కు ముందే రివ్యూ చెప్పేసిన గౌతమ్ మీనన్, వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి