Vishnu Manchu - RRR Oscar : ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆ కేటగిరిలో ఆస్కార్ అవార్డు.. ట్రోలర్‌కు మంచు విష్ణు ఘాటు రిప్లై

RRR Oscars Troll ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తుందని కొందరు ధీమా వ్యక్తం చేస్తుంటే.. ఇంకొందరు మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డుకు అర్హం కాదని ట్రోల్స్ చేస్తున్నారు.
Vishnu Manchu - RRR Oscar : ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రస్తుతం ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వెస్ట్రన్ ఆడియెన్స్ ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మన నాటు స్టెప్పులను వాళ్లు వేస్తున్నారు. థియేటర్లో నేల టికెట్ బ్యాచ్ చేసేంత అల్లరి అక్కడి బ్యాచ్ చేస్తోంది. ఇక రాజమౌళికి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చి ప్రేమను కురిపించారు ఆడియన్స్. అయితే అక్కడి ప్రేక్షకులు రాజమౌళిని, ఆర్ఆర్ఆర్ సినిమాను అంతలా మోస్తుంటే.. ఇక్కడి ప్రేక్షకులు మాత్రం ట్రోల్ చేస్తున్నారు.
తాజాగా ఓ నెటిజన్ ఆర్ఆర్ఆర్ గురించి సెటైర్ వేశాడు. అత్యంత బోరింగ్, వేస్ట్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు ఉంటే.. కచ్చితంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు వస్తుంది అంటూ తన ద్వేషాన్ని, విషాన్ని వెల్లగక్కాడు. అయితే దీనిపై మంచు విష్ణు ఇచ్చిన రిప్లై మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది నీదో నాదో కాదు.. మన ఇండియన్ సినిమా అంటూ హితబోధ చేశాడు.
అసలు మంచు విష్ణు ఇచ్చిన రిప్లై ఏంటో ఓ సారి చూద్దాం. 'మన ఇండియన్ సినిమాను ఎందుకు సెలెబ్రేట్ చేసుకోకూడదు బ్రదర్.. ఇది మన ప్రాంతీయానికి కాదు.. ఇది మన జాతి కీర్తి, గర్వానికి సంబంధించింది' అంటూ రిప్లై ఇచ్చాడు. మొత్తానికి మా ప్రెసిడెంట్ మంచు విష్ణు మాత్రం సోషల్ మీడియాలో ఇలా ఫుల్ బిజీగా ఉంటాడన్నసంగతి తెలిసిందే.
మంచు విష్ణు ప్రస్తుతం జిన్నా సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. మామూలుగా అయితే అక్టోబర్ 5న రావాల్సింది. కానీ థియేటర్ల సమస్య వస్తుందని జిన్నాను వెనక్కి వెళ్లాడు. పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్, మంచు విష్ణుల కాంబోలో రాబోతోన్న ఈ జిన్నా చిత్రంపై మంచి బజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే.
Also Read : Kasthuri Shankar - Nayanthara Surrogacy : చిక్కుల్లో నయన్.. చిచ్చుపెట్టిన కస్తూరీ
Also Read : Nayanthara Surrogacy : సరోగసి ద్వారా పిల్లల్ని కన్న సెలెబ్రిటీల లిస్ట్ ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook