Kasthuri Shankar - Surrogacy : ఇండియాలో సరోగసి నిషేదం.. 'గృహలక్ష్మీ' కొత్త అనుమానాలు!

Kasthuri Shankar on Surrogacy: నయనతార సరోగసీ మీద చర్చ నడుస్తున్న సమయంలో గృహాలక్ష్మీ సీరియల్ నటి సరోగసీ మీద చేసిన కామెంట్స్ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 10, 2022, 08:34 PM IST
  • సరోగసి ద్వారా తల్లైన నయన తార
  • చిచ్చు పెట్టేసిన గృహలక్ష్మీ తులసి
  • నెట్టింట్లో ట్రోల్స్‌పై కస్తూరీ కౌంటర్లు
Kasthuri Shankar - Surrogacy : ఇండియాలో సరోగసి నిషేదం.. 'గృహలక్ష్మీ' కొత్త అనుమానాలు!

Kasthuri Shankar on Surrogacy: గృహలక్ష్మీ సీరియల్‌తో కస్తూరీ శంకర్ అందరినీ మెప్పించేస్తోంది. తులసి పాత్రలో కస్తూరీ శంకర్ అదరగొట్టేస్తోంది. అయితే ఆమె ప్రస్తుతం బుల్లితెర, వెండితెర, ఓటీటీ అంటూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. ఇలా తెరపై ఎంత బిజీగా ఉన్నా కూడా సమాజంలోని వివాదాలు, సమస్యలు, విషయాల మీద స్పందిస్తుంటుంది. ఆమె సామాజికవేత్తగా, న్యాయవాదిగా, పొలిటికల్ అనలిస్ట్‌గా నెట్టింట్లో ఎంతో చురుగ్గా వ్యవహరిస్తుంటుంది.

తాజాగా నయనతార సరోగసి మీద కస్తూరీ శంకర్ పరోక్షంగా స్పందించింది. నయనతార పేరు ఎక్కడా కూడా ప్రస్థావించలేదు. కానీ ప్రస్తుతం ఉన్న సమయంలో సరోగసి మీద స్పందించడం, అది మన దేశంలో నిశిద్దం అని చెప్పడం చూస్తుంటే.. అది కచ్చితంగా నయనతారను కార్నర్ చేసినట్టుగానే ఉందని కస్తూరీ మీద నయన్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.

 

ఇండియాలో సరోగసిని బ్యాన్ చేశారు.. ఏదైనా వైద్య సంబంధ అడ్డంకులు ఉంటే తప్పా.. సరోగసిని ఆశ్రయించొద్దు. ఈ చట్ట 2022 జనవరి నుంచి అమల్లో ఉంది. ఇక ముందు ఇంకొన్ని రోజులు దీనిపై మనం మరింత వినబోతోన్నాం.. నీ పని నువ్ చూసుకో అని అంటోన్న ట్రోలర్లకు ఇదే నా సమాధానం. నేను ఓ న్యాయవాదిని. నేను దేని మీదైనా విశ్లేషణ చేయగలను.

ఈ విషయం మీద చర్చలు జరిగినా, జరగకపోయినా నా అభిప్రాయాలు ఏ స్వార్థం లేకుండా ఏ ప్రయోజనం ఆశించకుండా వెల్లడిస్తున్నాను అంటూ కస్తూరీ శంకర్ చెప్పుకొచ్చింది. మొత్తానికి నయన్ మాత్రం ఇప్పుడు ఇల్లీగల్ పని చేసిందంటూ కస్తూరీ శంకర్ చెప్పకనే చెప్పింది. కానీ తాను వారి గురించి మాట్లాడలేదని, వారితో లింక్మ పెట్టి వార్తలు రాస్తే లీగల్ గా ముందుకు వెళ్తానని హెచ్చరిస్తోంది. 

Also Read : HBD Rajamouli : ఇండియన్ సినిమాకు 'రాజ'మౌళి

Also Read : Nayanthara Surrogacy : సరోగసి ద్వారా పిల్లల్ని కన్న సెలెబ్రిటీల లిస్ట్ ఇదే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News