Ravi Teja Multi Starrer: రవితేజ, విశ్వక్‌సేన్ మల్టీస్టారర్.. విలన్‌గా మంచు మనోజ్?
Ravi Teja Multi Starrer: మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు విశ్వక్ సేన్ తో కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో విలన్ గా మంచు హీరో చేయబోతున్నట్లు సమాచారం.
Ravi Teja Multi Starrer: టాలీవుడ్‌లో మల్టీస్టారర్ ట్రెండ్ మళ్లీ ఊపుందుకుంటోంది. సీనియర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసేందుకు యంగ్ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్ గా ‘వాల్తేర్ వీరయ్య’లో చిరంజీవి, రవితేజ కలిసి నటించారు. మరోసారి మాస్ మహారాజా రవితేజ ఈసారి యంగ్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. మాక్ కా దాస్ విశ్వక్ సేన్ తో కలిసి‘ కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో నటించనున్నాడు రవితేజ.
ఈ చిత్రంలో మాస్ మహారాజా లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. గతంలో రవితేజ మిరపకాయ్ సినిమాలో టీచర్ గా నటించి మెప్పించారు. ఆయనకు శిష్యుడి పాత్రలో విశ్వక్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఇద్దరి కాంబోకు ఓ సాలిడ్ విలన్ కూడా సెలెక్ట్ చేశారంట మేకర్స్. ఈ సినిమాలో విలన్ గా మంచు మనోజ్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్.. ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెంచారు. ప్రస్తుతం ‘'వాట్ ది ఫిష్’' అనే చిత్రంలో ఆయన నటిస్తున్నారు.
Also Read: Mangalavaram teaser: ఆసక్తి రేపుతున్న పాయల్ 'మంగళవారం' టీజర్..
మరోవైపు రవితేజ టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న టైగర్ నాగేశ్వర రావు అక్టోబర్ 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఇంకోవైపు విశ్వక్‌సేన్.. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న #VS11 చిత్రంలో నటిస్తున్నారు. దీనికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read: Niharika Divorce: విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న నీహారిక, చైతన్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook