Dhamki Recovers 50 percentage in Day 1 విశ్వక్ సేన్ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. కాంట్రవర్సీలు పక్కన పెడితే.. నటుడిగా మాత్రం విశ్వక్ సేన్ ఎప్పుడూ నిరాశ పర్చలేదు. కాస్త యారగెంట్‌గా ఉండటం, పబ్లిక్‌గా బూతులు మాట్లాడటం వంటివి మినహాయిస్తే.. సినిమాల విషయంలో విశ్వక్ సేన్ పర్వాలేదనిపిస్తాడు. దర్శకుడిగానూ, నిర్మాతగానూ ఇది వరకే విశ్వక్ సేన్ సక్సెస్ అయ్యాడు. ఫలక్ నుమా దాస్ సినిమాతో అన్ని రకాలుగా తన మార్క్ చూపించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు దాస్ కా ధమ్కీ అంటూ వచ్చాడు. ఈ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించి హీరోగా చేశాడు విశ్వక్ సేన్. ఇప్పుడు ఈ సినిమాకు కలెక్షన్లు అదిరిపోయాయి. మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినా, నెగెటివ్ ట్రోలింగ్ జరిగినా కూడా కలెక్షన్ల మీద ఆ ప్రభావం మాత్రం పడలేదు. ఓవర్సీస్‌లో అయితే ప్రీమియర్స్, మొదటి రోజు కలిపి 150k డాలర్లను కొల్లగొట్టేసింది.


ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. ఎనిమిది కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి.. విశ్వక్ సేన్ కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. విశ్వక్ సేన్ కెరీర్‌లో డే వన్ రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలో ధమ్కీ ముందుంటుంది. ఇంత వరకు ఈ రేంజ్‌లో ఓపెనింగ్స్ విశ్వక్ సేన్‌కు రాలేదు.


ఎనిమిది కోట్ల గ్రాస్, నాలుగు కోట్ల షేర్ రావడంతో విశ్వక్ సేన్‌ సేఫ్ అయినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ పాయింటే ఎనిమిది కోట్ల షేర్. అందులో దాదాపు నాలుగు కోట్లు మొదటి రోజే వచ్చాయి. అంటే డే వన్‌తోనే సగం రాబట్టేసినట్టు అవుతుంది.


ఇక మిగిలిన సగం ఈ వీకెండ్‌లోనే కొట్టేస్తాడు. నెక్స్ వీక్ అంతా కూడా లాభాల బాట పడుతున్నట్టే. దసరా సినిమా వరకు ధమ్కీ సినిమా ఆడుతూనే ఉంటుంది. అంటే ఎటు చూసినా కూడా ఈ సారి విశ్వక్ సేన్ ఈజీగా గట్టెక్కేసేలా కనిపిస్తోంది. ఇక ధమ్కీ మంచి లాభాలను తీసుకొస్తే.. వెంటనే సీక్వెల్‌ పనులను కూడా ప్రారంభించేలా ఉన్నారు.


Also Read:  Rangamarthanda Movie Review : రంగ మార్తాండ రివ్యూ.. ఉండగలరా కన్నీరు కార్చకుండా?


Also Read: Das Ka Dhamki Movie Review : దాస్ కా ధమ్కీ రివ్యూ.. ప్లాన్ వేశాడు సీక్వెల్‌కి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook