Dhamki Day 1 Collection విశ్వక్ సేన్ నటించిన మాస్ కా ధమ్కీ సినిమా ఉగాది సందర్భంగా నిన్న (మార్చి 22) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ పరంగా కొన్ని విమర్శలు వచ్చాయి. కొత్త కథ కాకపోయినా కథనం పట్ల పర్వాలేదనే టాక్ వచ్చింది. మిక్స్డ్ రివ్యూలతో సినిమా కలెక్షన్ల మీద ప్రభావం పడేలా ఉంది. అయితే ఓవర్సీస్‌లో మాత్రం ధమ్కీ దుమ్ములేపేసినట్టుగా ఉంది. ధమ్కీ సినిమాకు, ధమాకా సినిమాకు మధ్య చాలా పోలికలున్నాయని కౌంటర్లు కూడా పడుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీనికి తగ్గట్టుగానే ఓ థియేటర్లో ధమ్కీకి బదులు ధమాకా సినిమాను ప్రదర్శించారు కూడా. అయితే అంతో ఇంతో ఎంటర్టైనింగ్‌గా ఉండటంతో సినిమా పాస్ అయ్యేలా ఉంది. బ్రేక్ ఈవెన్‌ను కొట్టేసేలా ఉంది. ఈ సినిమాకు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్‌ వచ్చేలా ఉంది. విశ్వక్ సేన్ ఈ సినిమాకు దర్శకుడిగా, నిర్మాతగానూ వ్యవహరించిన సంగతి తెలిసిందే.


ఉన్నదంతా కూడా ఈ సినిమా మీదే పెట్టేశాను అంటూ విశ్వక్ సేన్ చెప్పిన మాటలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే విశ్వక్ సేన్ కష్టానికి తగ్గట్టుగానే ఫలితం వచ్చేలా ఉంది. సినిమా అయితే బ్రేక్ ఈవెన్ అయ్యేలా ఉంది. లాభాలు కూడా తెచ్చి పెట్టేలానే ఉంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో మంచి కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తోంది.


మామూలుగా ఓవర్సీస్‌లో సినిమాలు అంతగా ఆడటం లేదు. వరుసగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద రిజెక్ట్ అవుతున్నాయి. 100k డాలర్లను కొల్లగొట్టేందుకు కూడా కొంత మంది చిన్న హీరోలు కష్టపడుతున్నారు. కానీ విశ్వక్ సేన్ మాత్రం ప్రీమియర్స్, మొదటి రోజులోనే 150k కొల్లగొట్టేశాడు. అంటే అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చినట్టే. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చినట్టుగా సమాచారాం.


Also Read:  Rangamarthanda Movie Review : రంగ మార్తాండ రివ్యూ.. ఉండగలరా కన్నీరు కార్చకుండా?


Also Read: Das Ka Dhamki Movie Review : దాస్ కా ధమ్కీ రివ్యూ.. ప్లాన్ వేశాడు సీక్వెల్‌కి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook