Vishwak Sen Shocking Comments: యంగ్ హీరో విశ్వక్ సేన్ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. గామి సినిమాతో ఇంకే హీరో చేయలేని రిస్క్ చేసిన విశ్వక్ సేన్ ఆ సినిమాతో మంచి రివ్యూస్ ని అందుకున్నాడు. తాజాగా విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా.. బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలై.. యావరేజ్ రెస్పాన్స్ ను అందుకుంది. థియేటర్స్ లో కలెక్షన్ తగ్గటంతో.. విడుదలైన 14 రోజులకే ఓటీటీలు ఈ సినిమాని విడుదల చేశారు. జూన్ 15 నుంచి ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే గామి సినిమాలో విశ్వక్ సేన్ సరసన హీరోయిన్ గా కనిపించిన చాందిని చౌదరి ఇప్పుడు యేవమ్.. అనే కాప్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ టాలీవుడ్ నటుడు నవదీప్.. సీ స్పేస్ ప్రొడక్షన్స్ బ్యానర్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ పాల్గొని.. నవదీప్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.


నవదీప్ గురించి మాట్లాడుతూ.. "నవదీప్ రొమాన్స్.. సారీ.. సారీ.. నవదీప్ అన్న సినిమాలో యాక్టింగ్ చేస్తే.. రొమాన్స్ ఎక్కువ.. ప్రొడ్యూస్ చేస్తే వైలెన్స్ ఎక్కువ అని అర్థమైంది నాకు" అంటూ విశ్వక్ సేన్ ఇన్ డైరెక్ట్ గా నవదీప్ మీద కౌంటర్ వేశారు. ఈ మధ్యనే నవదీప్ నటించిన లవ్ మౌళి సినిమాలో బోలెడు బోల్డ్ సన్నివేశాలు ఉన్న సంగతికి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ చూసే… ఎన్నో విమర్శలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా కూడా పెద్దగా విజయం సాధించలేదు.


ఈ నేపథ్యంలోనే విశ్వక్ సేన్.. నవదీప్ మీద ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ వేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఏదేమైనా విశ్వక్ సేన్ వ్యాఖ్యలు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు చాందిని చౌదరి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన్న యేవమ్ సినిమాకి ప్రకాష్ దంతులూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా శుక్రవారం విడుదలై మిక్స్ట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.


Also Read: Nara Lokesh: యాక్షన్‌ మోడ్ ఆన్.. తొలి అడుగులోనే మంత్రి లోకేష్ ఊహించని నిర్ణయం


Also Read: Vote Percentage: తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌.. వైఎస్సార్‌సీపీకి కలిసొచ్చిన అదృష్టం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి