Gaami Movie censor talk review: మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ ముందు నుంచి తనకంటూ ప్రత్యేక పాత్రలతో అలరిస్తున్నాడు. ఇపుడు తొలిసారి అఘోరా పాత్రలో కనిపంచబోతున్నాడు. విద్యాధర్ కాగితా దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు.. ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసింది. మహా శివరాత్రి కానుకగా ఈ సినిమా మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. భారీ విజువల్ ట్రీట్‌తో వస్తోన్న 'గామి' సినిమా ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ వాళ్లు 'A' సర్టిఫికేట్ జారీ చేశారు. అంతేకాదు ఈ సినిమా మొత్తం ఆధ్యాత్మికతతో పాటు సస్పెన్స్  ఈ సినిమాలో మెయిన్ పాయింట్. మరోవైపు అఘోరాల గురించి ఈ సినిమాలో చూపించిన విధానం ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తోందన్నారు. ఈ సినిమాలో సన్నివేశాలు కొన్ని హింసాత్మక సన్నివేశాల కారణంగా 'A' సర్టిఫికేట్ జారీ చేసినట్టు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో విశ్వక్ సేన్ నటన ఆకట్టుకునేలా ఉంది. కొన్ని సీన్స్ చూస్తే గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.ఈ సినిమాలో విశ్వక్‌సేన్ ఒక సమస్యతో బాధపడుతూ ఉంటాడు.  అతను ఆ సమస్య నుంచి బయటపడాలి అంటే మూడు పుష్కరాలు (36 ఏళ్ల)కి ఒకసారి హిమాలయాల్లో జరిగే అద్భుతానికి సంబంధించి ఒక ప్రదేశానికి చేరుకోవాలి అని చెబుతారు ఆయన గురువు. ఆ పనిపైనే అక్కడికి హీరో బయల్దేరతాడు. ఆ ప్రయత్నంలో అతనికి ఎలాంటి అవరోధాలు ఎదురవుతాయనేదే 'గామి' చిత్ర కథ.


ఈ ట్రైలర్లో హీరో పాత్రతో పాటు మరో రెండు పాత్రలు మాత్రమే ఉన్నాయి. ఒక  క్యారెక్టర్‌లో ఒక ఊరిలో దేవదాసిగా ఉన్న మహిళ, మరో పాత్ర పరిశోధనశాలలో బంధీగా ఉన్న ఓ కుర్రాడు. అసలు ఈ రెండు పాత్రలకు హీరో పాత్రకి ఉన్న సంబంధం ఏమిటి.. మధ్యలో హీరోయిన్ చాందిని చౌదరి పాత్ర వెనుక కథ ఏమిటి అని ఎన్నో సందేహాలతో ఇంట్రెస్టింగ్ గా ఈ ట్రైలర్ ఉంది. ట్రైలర్‌లో ఉన్న విధంగానే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనేది ఈ సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. 


Read More: Insulin: ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉందా? ఈ 3 ఆకులను నమిలండి చాలు.. షుగర్ కంట్రోల్ అవుతుంది..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook