Gaami OTT Streaming News: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్‌సేన్  లీడ్ రోల్లో యాక్ట్ చేసిన సినిమా 'గామి. చాందిని చౌదరి మరో ముఖ్య‌పాత్ర‌లో నటించింది. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన మూవీలో విశ్వక్‌సేన్ అఘోర పాత్ర‌లో న‌టించాడు. మనుషుల స్పర్శను తట్టుకోలేని శంకర్ అనే అఘోర పాత్రలో విశ్వక్ సేన్ తన నటనతో మెప్పించాడు. టాలీవుడ్‌లో  రెగ్యులర్‌గా వచ్చే చిత్రాల‌కు డిఫ‌రెంట్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు మంచి విజ‌య‌మే సాధించింది.  ఈ సినిమాలో ఆధ్యాత్మికతతో పాటు సైన్స్, మూఢ నమ్మకాల సమ్మిళతంగా ఈ చిత్రాన్ని విద్యాధర్ కాగిత ఎంతో ఇంట‌లెక్చువ‌ల్‌గా  తెరకెక్కించాడు. మరోవైపు ఈ సినిమాకు నిర్మాణ విలువలు, గ్రాఫిక్స్ వర్క్స్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఇప్ప‌టికే థియేట్రిక‌ల్ ర‌న్ ముగిసిన ఈ సినిమా తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖ‌రారైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా జీ5లో ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానున్న‌ట్టు స‌మాచారం. మొత్తంగా థియేట్రిక‌ల్‌గా మెప్పించిన ఈ సినిమా ఓటీటీలో ఈ సినిమా ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు రూ. 12 కోట్ల షేర్ (రూ. 24 కోట్ల గ్రాస్ ) వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.


ఈ సినిమా థియేట్రిక‌ల్ బిజినెస్ విష‌యానికొస్తే..


తెలంగాణ (నైజాం).. రూ. 3.50 కోట్లు..
రాయలసీమ (సీడెడ్).. రూ. 1.2 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్ .. రూ. 3.50 కోట్లు..
తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 8.20 కోట్లు
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 2 కోట్లు..
టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 10.20 కోట్లు..


విశ్వక్ సేన్ లాస్ట్ మూవీ 'దమ్కీ' మూవీ మంచి బిజినెస్ చేసింది. తాజాగా విడుదలైన 'గామి' సినిమా కూడా అదే రేంజ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవ‌డం విశేషం.


Read More: Pregnant Colleague: ఇదేం కన్నింగ్ బుద్ధి.. ప్రెగ్నెంట్ లేడీ తాగే నీటిలో విషం కల్పిన సహోద్యోగి.. కారణం తెలిస్తే షాక్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook