Game On Teaser : రొమాంటిక్‌గా బిగ్ బాస్ వాసంతి.. సీరియస్‌గా మధుబాల.. టీజర్‌లో హైలెట్స్ ఇవే
Vishwak Sen Release Game On Teaser గేమ్ ఆన్ టీజర్‌ను విశ్వక్ సేన్ విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే మాత్రం రొటీన్ సినిమాలా ఎక్కడా కనిపించడం లేదు. ఏదో కొత్త పాయింట్‌తో సినిమా రాబోతోన్నట్టుగా కనిపిస్తోంది.
Game On Teaser News మధుబాల ప్రస్తుతం తెలుగులో ఫుల్ బిజీ అవుతోంది. వెబ్ సిరీస్‌లు, సినిమాలు అంటూ తెలుగు వారి ముందుకు వస్తోంది. బిగ్ బాస్ షోతో ఫేమస్ అయిన వాసంతి సైతం ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉంది. గీతానంద్, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా నటించిన ‘గేమ్ ఆన్’ సినిమాలో మధుబాల, వాసంతి వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.
గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను ఏ కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్ మీద నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ టీజర్‌ను నిన్న విశ్వక్ సేన్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఈ టీజర్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లు, రొమాంటిక్ సీన్లు అన్నీ ఉన్నాయి. టీజర్ చూస్తుంటే సినిమా మీద ఇంట్రెస్ట్ కలిగించేలా ఉంది.
టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్స్ అశ్విన్ - అరుణ్ మాట్లాడుతూ.. తమకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ అని, ఇందులో ఒక రొమాంటిక్ ట్రాక్‌ను కంపోజ్ చేశామని, త్వరలోనే పాటలు రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చాడు. నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ.. ఓ పాపలాగా కేర్ తీసుకుని మరీ గేమ్ ఆన్ సినిమాను చేశామని అన్నాడు. ఈ మూవీ ఓ ట్రెండ్ క్రియేట్ చేస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.
డైరెక్టర్ దయానంద్ మాట్లాడుతూ .. ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్ ఉన్నాయని, అన్ని ఎమోషన్స్ ఆకట్టుకుంటాయని అన్నాడు. ఈ మూవీ యూనిక్ పాయింట్‌తో తెరకెక్కిందని, సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే కాన్ఫిడెంట్‌గా ఉన్నామని అన్నారు.
గేమ్ ఆన్ టీజర్ చూడగానే విశ్వక్ ఫోన్ చేసి టీజర్ లాంచ్ చేస్తానని అన్నాడని హీరో గీతానంద్ సీక్రెట్ రివీల్ చేశాడు. ఈ సినిమా ఫలానా అని స్పెషల్ లేబుల్స్ అని ఇవ్వలేనని, ఎందుకంటే ఇదొక కంప్లీట్ ప్యాకేజ్ మూవీ అని చెప్పుకొచ్చాడు. ఇంటెన్స్ క్యారెక్టర్స్ మధ్య జరిగే ఎమోషనల్ జర్నీ అని చెప్పుకొచ్చాడు. విజువల్స్, మ్యూజిక్, ఆర్ఆర్ అన్నీ అద్భుతంగా ఉంటాయని అన్నాడు. ఆడియెన్స్‌ను ఓ కొత్త లోకంలోకి తీసుకెళతుంది అని అన్నారు.
కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయటంలో టాలీవుడ్, తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారని టీజర్ లాంచ్‌కు గెస్టుగా వచ్చిన విశ్వక్ సేన్ అన్నాడు. 2013 -14 టైమ్‌లో తాను, దయానంద్ అందరం 5డీ కెమెరాలతో షార్ట్ ఫిలింస్ చేసి మా ఐడియాస్‌ను షేర్ చేసుకుంటుండేవాళ్లమని నాటి విషయాలను గుర్తు చేసుకున్నాడు. నిర్మాత రవి కూడా తమ కాలేజ్‌లోనే చదివారని, గేమ్ ఆన్ టీజర్ చాలా బావుందని ప్రశంసించాడు.
Also Read: Sonu Nigam Attack Video : స్టార్ సింగర్‌పై ఎమ్మెల్యే కొడుకు దాడి.. ఈవెంట్‌లో గొడవ.. వీడియో వైరల్
Also Read: G V krishna rao Death : ఇండస్ట్రీలో విషాదం.. క్లాసిక్ సినిమాలకు పని చేసిన సీనియర్ ఎడిటర్ కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook