Das Ka Dhamki Break Even in 4 Days: విష్వక్ సేన్ హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించిన తాజా చిత్రం దాస్ కా ధమ్కీ. నిజానికి గతంలో విష్వక్ సేన్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఫలక్నామాదాస్ సూపర్ హిట్ కావడంతో అదే ధైర్యంతో తన డైరెక్షన్లో ఈ సినిమా కూడా చేశాడు విష్వక్ సేన్. అయితే ముందుగా నరేష్ అనే మరో దర్శకుడి తో ఈ సినిమా ప్రారంభించారు కానీ ఎందుకో నరేష్ సరిగ్గా సినిమాని డీల్ చేయడం లేదనిపించి ఆయనను తప్పించి విష్వక్ సేన్ మెగా ఫోన్ పట్టుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సొంత డబ్బులు పెట్టి నిర్మించాడు విష్వక్ సేన్. ఇక ఈ సినిమా నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఎవరూ ఊహించని విధంగా హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ఇంతింతై వటుడు ఇంతై అన్నట్టుగా దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా మార్చి 22వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా తెలుగులో విడుదలైంది.


మొదటి రోజు ఈ సినిమా మూడు కోట్ల ఆరు లక్షలు వసూలు చేయగా రెండో రోజు కోటి ఐదు లక్షలు, మూడవ రోజు కోటి రెండు లక్షలు, నాలుగో రోజు కోటి 22 లక్షల వసూలు చేసింది. శనివారం కావడంతో నాలుగో రోజు వసూళ్లు కలిసి వచ్చాయి.  అలా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు కోట్ల 35 లక్షల షేర్ వసూలు చేసిన ఈ సినిమా 11 కోట్ల 70 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్స్ ఈ మేరకు ఉన్నాయి.


నైజాం ప్రాంతంలో 64 లక్షలు వసూలు చేసిన ఈ సినిమా సీడెడ్ లో 18 లక్షలు, ఉత్తరాంధ్ర 14 లక్షలు, ఈస్ట్ గోదావరి ఎనిమిది లక్షలు, వెస్ట్ గోదావరి 4 లక్షలు, గుంటూరు 5 లక్షలు, కృష్ణ 6 లక్షలు, నెల్లూరు 3 లక్షలు, చొప్పున వసూలు చేసి కోటి 22 లక్షలు షేర్ వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజులకు గాను ఈ సినిమా ఎనిమిది కోట్ల 37 లక్షల షేర్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్  టార్గెట్ పూర్తి చేసుకుంది. వాస్తవానికి ఈ సినిమా బిజినెస్ 7.30 కోట్లకు జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్గా ఎనిమిది కోట్లు నిర్ణయించారు. ఇప్పటికే 37 లక్షల లాభంతో ఈ సినిమా దూసుకుపోతోంది. ఈరోజు ఆదివారం కలిసి రావడంతో ఈ రోజు వసూళ్లు మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Also Read: Jr NTR Lovely Wishes: లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు.. 'అమ్మలూ' అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ విషెస్


Also Read: Mallareddy Pawan kalyan Offer: పవన్ కళ్యాణ్ విలన్ గా మల్లారెడ్డి.. జస్ట్ లో మిస్ అయిందట?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook