Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచి పేరు సొంతం చేసుకుని..తన అద్భుతమైన నటనతో వేలాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆరుపదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస చిత్రాలతో బిజీగా మారారు. గత ఏడాది భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బోల్తా పడ్డారు చిరంజీవి.  ఇక ఇప్పుడు ఎలాగైనా సరే విజయం అందుకోవడానికి విశ్వంభర సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేయబోతున్నారు చిత్ర బృందం. ఇందులో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ త్రిష హీరోయిన్ గా ఎంపికైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదంతా పక్కన పెడితే, మెగాస్టార్ తన ఫ్యామిలీ గురించి ఎంతగా ఆలోచిస్తారో.. అందరికీ తెలిసిందే.  ముఖ్యంగా మెగా కుటుంబం మొత్తం ఎంతో అన్యోన్యంగా కలిసి మెలిసి జీవిస్తున్నారు. అయితే భవిష్యత్తులో ఎప్పుడైనా విడిపోయి అవకాశం కూడా ఉంటుందని ముందే గ్రహించాడు చిరంజీవి. అందుకే ఎక్కడ ఫ్యామిలీ విడిపోతుందేమో అనే భయంతో ఎవరు ఊహించని ప్లాన్ చేశారట చిరంజీవి. ఈ కారణంగానే మెగా కుటుంబం ఇప్పటికీ కలిసిమెలిసి ఉంటుంది అంట. మరి చిరంజీవి ప్లాన్ ఏంటి అనే విషయానికి వస్తే..  ఎవరు తమ పనులలో ఎంత బిజీగా ఉన్నా సరే నెలలో తప్పకుండా రెండుసార్లు అంతా ఒకచోట చేరి జాయ్ ఫుల్ గా గడపాలని రూల్ పెట్టుకున్నారట. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ సైతం చెప్పుకొచ్చారు.


అంతేకాదు మెగా కుటుంబంలో సభ్యుల మధ్య ఏదైనా గొడవ ఉంటే అందరూ ఒకే చోట మీట్ అయ్యాక తప్పకుండా మాట్లాడుకోవాలని కూడా చెప్పారట. ఇలా కలిసిన చోట ఒకరికొకరు సుఖ దుఃఖాలను పంచుకుంటూ.. తమ మధ్య విభేదాలు లేకుండా సామరస్యంగా ముందుకు వెళ్తున్నారట.అంతేకాదు చిన్న చిన్న గొడవలు ఉన్నా సరే మరిచిపోయి సంతోషంగా గడుపుతున్నారట. ఈ కారణంగానే మెగా ఫ్యామిలీ ఇప్పటకీ ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా ఉందని నెట్టింట ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా చిరంజీవి ముందు చూపుకి తన కుటుంబం అంతా కలిసి ఉండాలని చిరంజీవి ఆలోచనకి మెగా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు . ఏది ఏమైనా స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నేడు ఈ స్థాయికి చేరుకున్నాడు అంటే ఆయన భవిష్యత్తు గురించి ఎంత ఆలోచిస్తారో అర్థం చేసుకోవచ్చు.


Read more: Telangana: ఫుల్ జోష్ లో గులాబీ బాస్.. కాంగ్రెస్ నుంచి మళ్లీ  బీఆర్ఎస్ లోకి ఆ ఎమ్మెల్యేలు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter