Vishwambhara : మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇప్పుడు బింబిసారా వంటి హిట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. విశ్వంభర అనే టైటిల్ తో ఒక సోషియో ఫాంటసీ సినిమాగా ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదల కి సిద్ధం అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమా కథ ప్రకారం చిరంజీవి పాత్రకి ఐదుగురు చెల్లెళ్లు ఉంటారట. ఇప్పటికే ఈషా చావ్లా, సురభి, ఆషిక రంగనాథ్ లు ఈ సినిమాలో చిరు చెల్లెళ్ల పాత్రల్లో కనిపిస్తారు అని టాక్ వినిపిస్తోంది. మీనాక్షి చౌదరి, మృణాల్ ఠాకూర్ లు కూడా సినిమాలో ఉన్నారు. మరి వాళ్ళు చిరు సరసన హీరోయిన్లుగా కనిపిస్తారా లేక చెల్లెళ్ల లాగా కనిపిస్తారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.


ఇక సినిమాలో మెయిన్ హీరోయిన్ మాత్రం త్రిష అని తెలుస్తోంది. తాజాగా చిరంజీవి చెల్లెళ్ల పాత్రలలో నటిస్తున్న హీరోయిన్లకు జోడిగా తగిన ఆర్టిస్ట్ లను వెతికే పనిలో ప్రస్తుతం చిత్ర బృందం బిజీగా ఉంది. భారీ బడ్జెట్ సినిమా కాబట్టి కొంచెం పేరు, గుర్తింపు ఉన్న యువ హీరో లను ఈ క్యారెక్టర్ల కోసం తీసుకుంటారని సమాచారం. భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ సరసన సుశాంత్ ను తీసుకున్నట్టే నవీన్ చంద్ర, రాజ్ తరుణ్ వంటి యువ హీరోలను ఈ సినిమా కోసం అనుకుంటున్నారట. బింబిశార రేంజ్ లో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ కూడా బాగానే డిజైన్ చేశారట.


ఈ సినిమాతో మెగాస్టార్ కచ్చితంగా పెద్ద హిట్ అందుకుంటారని ఇంతకుముందు ఎన్నడూ కనిపించినటువంటి పాత్రలో ప్రేక్షకులను అలరిస్తారు అని మెగా అభిమానులు అప్పుడే జోష్యం చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. షూటింగ్ షెడ్యూల్ ల మధ్యలో ఎటువంటి సమస్యలు రాకుండా చక్కటి ప్లానింగ్ తో చిత్ర బృందం ముందుకు సాగుతోంది. 


టాకీ పార్ట్ మరియు పాటలు పూర్తిచేసి నిర్మానాంతర పనుల కోసం ఎక్కువ సమయం కేటాయించడానికి చిత్ర బృందం ఇప్పటికే ప్రణాళికలు వేసుకుంది. యు వి క్రియేషన్స్ వారు 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.


Read More: Grapes Fruit Benefits: ద్రాక్ష పండు రుచికరం మాత్రమే కాదు ఆరోగ్యకరమైనది కూడా..!


Read More: Rashmika: చిన్నప్పటి కళ ఇప్పటికి నెరవేరింది.. రష్మిక ఎమోషనల్ పోస్ట్..



 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook